బాహుబలి తర్వాత సౌత్ సినిమాలకు బాలీవుడ్‌లో ఆదరణ పెరిగింది. అక్కడి ప్రేక్షకులు లాంగ్వేజ్ బారియర్స్ లేకుండా బాహుబలి, పుష్ప, కార్తికేయ 2, కాంతార, కేజియఫ్ లాంటి సినిమాలు చూసారు. వందల కోట్ల కలెక్షన్లు కట్టబెట్టారు. మరీ ముఖ్యంగా కేజియఫ్, బాహుబలి సీక్వెల్స్ 1000 కోట్ల క్లబ్‌లో చేరాయంటే.. బాలీవుడ్ వసూళ్లే కారణం. నార్త్ నుంచి బాహుబలి 2కు 510 కోట్లు వస్తే.. కేజియఫ్ 2కు 435 కోట్లు వచ్చాయి.