Entertainment: ఓటిటి నుండి వెండితెర వరకు అదిరిపోయే సినిమా కబుర్లు..

లారెన్స్, కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో సీనియర్ దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న సినిమా చంద్రముఖి 2. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఇందులోని తోరి బోరి అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా స్కంద. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం బుక్ మై షో యాప్‌లో 100K ఇంట్రెస్ట్‌లను సొంతం చేసుకుంది.

Anil kumar poka

|

Updated on: Sep 14, 2023 | 1:52 PM

లారెన్స్, కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో సీనియర్ దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న సినిమా చంద్రముఖి 2. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఇందులోని తోరి బోరి అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.

1 / 6
శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా ముత్యాల మెహర్ దీపక్ తెరకెక్కిస్తున్న హార్రర్ థ్రిల్లర్ తంతిరం. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వాళ్ల దాంపత్య జీవితం ఎలా ఉంటుందనే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సినిమా సెప్టెంబర్ 22న విడుదల కానుంది.

2 / 6
కార్తి హీరోగా కొత్త దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కిస్తున్న సినిమా జపాన్. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ మొదలైంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

3 / 6
రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా స్కంద. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం బుక్ మై షో యాప్‌లో 100K ఇంట్రెస్ట్‌లను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ సలార్ సినిమాలు మాత్రమే ఈ ఫీట్ అందుకోగా.. ఇప్పుడు స్కంద వాటి సరసన చేరింది. సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

4 / 6
కాశ్మీర్ ఫైల్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న సినిమా వాక్సిన్ వార్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. కాశ్మీర్ ఫైల్స్ మాదిరే ఇది కూడా ఆసక్తికరంగా ఉంది.

5 / 6
సీనియర్ నటుడు వేణు, అవంతిక మిశ్రా ముఖ్య పాత్రల్లో ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా భరత్ వైజీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ అతిథి. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సెప్టెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటిటిలో ఇది ప్రసారం కానుంది.

6 / 6
Follow us