Amit Shah: తెలంగాణలో సెప్టెంబర్17 హీట్.. నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..

Telangana Liberation Day: సెప్టెంబర్ 17 చుట్టూ మరోసారి తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్‌లో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, సెప్టెంబర్ 17 వేడుకలపై ఒక్కో పార్టీ ఒక్కో నినాదం ఇస్తోంది. అయితే ఇది విలీనమో.. విమోచనమో లేక సమైక్యతా దినమో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్ చేస్తోంది బీజేపీ.

Amit Shah: తెలంగాణలో సెప్టెంబర్17 హీట్.. నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..
Telangana BJP
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 16, 2023 | 8:39 AM

Telangana Liberation Day: సెప్టెంబర్ 17 చుట్టూ మరోసారి తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్‌లో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, సెప్టెంబర్ 17 వేడుకలపై ఒక్కో పార్టీ ఒక్కో నినాదం ఇస్తోంది. అయితే ఇది విలీనమో.. విమోచనమో లేక సమైక్యతా దినమో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్ చేస్తోంది బీజేపీ. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్‌‌కు రానున్నారు. అయితే, అమిత్ షా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈనెల 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న అమిత్‌ షా.. శనివారం రాత్రి 7 గంటలా 20 నిమిషాలకు అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నేరుగా సీఆర్పీఎఫ్‌ సెక్టార్‌ మెస్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

17వ తేదీ ఉదయం 9 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్‌ షా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ చేరుకుంటారు. ముందుగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. ఉదయం 11 గంటలా 10 నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాలు, తర్వాత ఆయన ప్రసంగిస్తారు. వేడుకల అనంతరం 11గంటలా 15 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి సీఆర్‌పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకుంటారు. విమోచన దినోత్సవాల్లో పాల్గొన్న తర్వాత 11:50 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు సీఆర్‌పీఎఫ్‌ సెక్టార్‌లోనే ఉంటారు. అయితే ఈ రెండు గంటల్లో బ్యాడ్మింటన్‌ పీవీ సింధుతోపాటు మరికొందరితో అమిత్‌ షా భేటీ అవుతున్నట్లు సమాచారం. సీఆర్ పీఎఫ్ మెస్ నుంచి ఒంటి గంటా 45 నిమిషాలకు షా శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరతారు. 2 గంటలా 25 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు అమిత్‌షా.

ఇదిలాఉంటే.. విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్రమంత్రి, టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి పరకాల అమరధామం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. బీజేపీ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. హబ్సిగూడ, భువనగిరి, జనగాం, వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాల వరకు సాగిందీ ర్యాలీ. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ బీజేపీ. విమోచన పోరాటాన్ని పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని, సైనికులు మరణించిన స్థలాలను స్మారక చిహ్నాలుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో కిషన్‌రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 17ను సమైక్యదినం అనే వాళ్ళు మూర్ఖులు, చరిత్ర హీనులే అన్నారు కిషన్‌రెడ్డి. సమైక్యత దినమా.. విమోచన దినమా.. అనేది తేల్చుకుందాం పరకాలకు రావాలంటూ సవాల్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో మీటింగ్ పెట్టే హక్కు కాంగ్రెస్‌కు లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..