IND vs BAN: రోహిత్ విజయ పరంపర కొనసాగేనా..? బంగ్లాతో భారత్ ఢీ.. ప్లేయింగ్ ఎలెవన్ వివరాలివే..

IND vs BAN, Asia Cup 2023: ఆసియా కప్ టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో బంగ్లాదేశ్ పూర్తిగా చేతులెత్తేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై, రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై ఓడిపోయి టోర్నీ నుంచి ఔట్ అయింది. నేటి మ్యాచ్ ఆడినా అది నామమాత్రమే కానీ బంగ్లాదేశ్‌ రాతను మార్చేది అయితే కాదు. మరోవైపు పాకిస్తాన్, శ్రీలంకపై వరుసగా 228, 41 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌పై వరుసగా 21 పరుగులు, 2 వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్‌లో..

IND vs BAN: రోహిత్ విజయ పరంపర కొనసాగేనా..? బంగ్లాతో భారత్ ఢీ.. ప్లేయింగ్ ఎలెవన్ వివరాలివే..
IND vs BAN Asia Cup 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 15, 2023 | 6:53 AM

ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లోని చివరి మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే టోర్నీ ఫైనల్‌కు చేరడం, బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో నేటి మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ ఇది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కీలక మ్యాచ్ కానుంది. ఎందుకంటే ఆసియా కప్ టోర్నీలో కెప్టెన్‌గా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రోహిత్.. తన విజయ పరంపరను కొనసాగించాలంటే నేటి మ్యాచ్‌లో కూడా భారత్ గెలిచి తీరాలి. భారత్ తరఫున ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లకు రోహిత్ కెప్టెన్‌గా  వ్యవహరించగా, వాటిల్లో 8 మ్యాచ్‌ల్లో టీమిండియా విజేతగా నిలిచింది. మరో మ్యాచ్ ఫలితం లేకుండానే రద్దయింది. అంటే ఆసియా కప్ టోర్నీలో రోహిత్ తిరుగులేని కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ నేటి మ్యాచ్‌, టోర్నీ ఫైనల్‌లో కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. నేటి మ్యాచ్‌ కోసం టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్‌లకు దూరమైన శ్రేయాస్ అయ్యర్, అలాగే మహ్మద్ షమి నేటి మ్యాచ్ కోసం జట్టులోకి రానున్నారు. ఇంకా వీరితో పాటు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బూమ్రా స్థానాల్లో ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి రానున్నారని సమాచారం. ఇదే జరిగితే నేటి మ్యాచ్ కోసం ఇషాన్ కిషన్‌తో పాటు మరో ఆటగాడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.

టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్

ఆసియా కప్ టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో బంగ్లాదేశ్ పూర్తిగా చేతులెత్తేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై, రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై ఓడిపోయి టోర్నీ నుంచి ఔట్ అయింది. నేటి మ్యాచ్ ఆడినా అది నామమాత్రమే కానీ బంగ్లాదేశ్‌ రాతను మార్చేది అయితే కాదు. మరోవైపు పాకిస్తాన్, శ్రీలంకపై వరుసగా 228, 41 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌పై వరుసగా 21 పరుగులు, 2 వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక ఆసియా కప్ 2023 ఫైనల్‌లో సెప్టెంబర్ 17న తలపడనున్నాయి.

నేటి మ్యాచ్ కోసం ఇరుజట్ల ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.

బంగ్లాదేశ్ జట్టు: మహ్మద్ నయీమ్, మెహిదీ హసన్ మిరాజ్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్) , తౌహిద్ హృదయ్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), షమీమ్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్