Viral: కొలంబో స్టేడియంలో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇండియా, శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్..
ఆసియాకప్ సూపర్ ఫోర్ స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 41 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆదివారం జరిగే ఫైనల్‌కు భారత జట్టు అర్హత సాధించింది. అయితే మంగళవారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు. ప్రేమదాస్ స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు చేయిసుకున్నారు.
ఆసియాకప్ సూపర్ ఫోర్ స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 41 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆదివారం జరిగే ఫైనల్‌కు భారత జట్టు అర్హత సాధించింది. అయితే మంగళవారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు. ప్రేమదాస్ స్టేడియంలోని ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు చేయిసుకున్నారు. శ్రీలంక క్రికెట్ జట్టు జెర్సీలో ఉన్న ఓ వ్యక్తి.. మరో బృందంపై అటాక్ చేశాడు. ఆ సమయంలో కొందరు ఆ ఇద్దర్నీ నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా.. 213 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్‌కు దిగిన శ్రీలంక. 42 ఓవర్లలో కేవలం 172 రన్స్ చేసి ఆలౌటైంది. సూపర్ 4 స్టేజ్ లో ఇండియాకు వరుసగా ఇది రెండో విక్టరీ. ఫస్ట్ మ్యాచ్‌లో పాక్‌పై 228 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. గ్రూప్ ఫోర్ స్టేజ్‌లో నాలుగు పాయింట్లతో ఇండియా అగ్రస్థానంలో ఉంది. పాక్, లంక జట్లు రెండేసి పాయింట్లు సాధించాయి. పాక్, లంక్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే, ఆ జట్టు ఫైనల్లో ఇండియాతో ఆడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..