Hyderabad: బస్తీమే సవాల్.. నేను చెప్పిందే వినాలంటూ గొడవ.. ఒకరి పరిస్థితి విషమం..
బస్తీమే సవాల్.. నా మాటే వినాలి.. అంటూ రెండు గ్రూప్స్ మధ్య తలెత్తిన వివాదం.. ఒకరిని పరిస్థితిని విషమంగా మార్చేసింది. మరికొందరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఆ ఏరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డైరీ ఫార్మ్ ఫోర్ యు కాలనీలో యువకులు రెండు గ్రూఫ్‌లుగా ఏర్పడి ఘర్షణకు దిగారు.
Hyderabad News: బస్తీమే సవాల్.. నా మాటే వినాలి.. అంటూ రెండు గ్రూప్స్ మధ్య తలెత్తిన వివాదం.. ఒకరిని పరిస్థితిని విషమంగా మార్చేసింది. మరికొందరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఆ ఏరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డైరీ ఫార్మ్ ఫోర్ యు కాలనీలో యువకులు రెండు గ్రూఫ్‌లుగా ఏర్పడి ఘర్షణకు దిగారు. గత కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతూ.. ఆధిపత్యం కోసం కాలనీలో రచ్చ చేస్తున్నారు. తాము చెప్పిందే వినాలంటూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
గత ఆరు నెలల క్రితం నలుగురి మధ్యల గొడవ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెద్దల సమీక్షంలో సమస్య పరిష్కరించుకున్నారు. మరొకసారి ఇలాంటి గొడవలకు వెళ్ళమని రాతపూర్వకంగా రాసిచ్చారు కూడా. ఆ తర్వాత ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకున్నారు. ఆ తర్వాత అంతా సద్దుమణిగినట్టుగా నటించిన యువకులు.. ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు కక్ష పెంచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే యువకులు మళ్లీ ఇప్పుడు రెండు గ్రూపులుగా విడిపోయి.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని ఆస్పత్రి పాలయ్యారు. కర్రలతో ఇనుప రాడ్లతో దాడి చేయడంతో నలుగురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. దాడికి గల కారణాలపై ఆరా తీశారు. సమీ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
కాలనీలో పోలీస్ గస్తీ పెంచాలని, దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కాలనీవాసులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గాయాలైన వ్యక్తులు ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో నలుగురికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. బాధిత వ్యక్తుల కుటుంబ సభ్యులు.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్‌ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ యువకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇతర సమస్యలు కూడా స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయంటున్నారు. కాగా, ఇదివరకే తరచూ ఘర్షణలకు పాల్పడుతున్న యువకులను గుర్తించిన పోలీసులు.. వారిపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు. అయినప్పటికీ యువతలో మార్పు రావడం లేదు. పిట్టి కేసుల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని.. అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు కూడా వారి తల్లిదండ్రులకు, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కానీ, సదరు యువకులు మారినట్టు నటిస్తూ మళ్ళీ పదేపదే ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటం కలవరపాటుకు గురి చేస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..