Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు తాత్కాలిక ఊరట.. అప్పటి వరకు సమన్లు జారీ చేయోద్దన్న సుప్రీంకోర్టు..

Delhi Liquor Scam: మనీ లాండరింగ్​ నిరోధక చట్టంలోని సెక్షన్​ 50 కింద తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని ఆమె సవాల్​ చేస్తూ.. సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లు.. మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్​పీసీలోని సెక్షన్​ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నందున వెంటనే వాటిని కొట్టేయాలని కవిత కోరారు. దీంతో సుప్రీంకోర్టు..

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు తాత్కాలిక ఊరట.. అప్పటి వరకు సమన్లు జారీ చేయోద్దన్న సుప్రీంకోర్టు..
MLC Kavitha
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 16, 2023 | 7:14 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల అంటే సెప్టెంబర్ 26 వరకు కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ చేయవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. నళినీ చిందబరం తరహాలోనే తనకూ ఊరట ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. ఆమె వేసిన పిటిషన్​పై ఈడీ న్యాయవాది స్పందనను సుప్రీం ధర్మాసనం కోరింది. ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ ​జనరల్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి జస్టిస్​ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ గురువారం మరో సారి సమన్లు జారీ చేసింది. అందులో శుక్రవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఉంది. ఈ విషయంపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మనీ లాండరింగ్​ నిరోధక చట్టంలోని సెక్షన్​ 50 కింద తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని ఆమె సవాల్​ చేస్తూ.. సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లు.. మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్​పీసీలోని సెక్షన్​ 160 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నందున వెంటనే వాటిని కొట్టేయాలని కవిత కోరారు.

ఇవి కూడా చదవండి

దీంతో సుప్రీం కోర్టు కాజ్ ​లిస్ట్​ ప్రకారం శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చి.. ఈ నెల 26 వరకు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌, ఎమ్మెల్సీ కవితలు సౌత్‌ గ్రూప్‌ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించి ఢిల్లీ లిక్కర్‌ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని లబ్ధి పొందారన్నది ఈడీ ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలోనే ఈడీ గత మార్చి 16, 20, 21వ తేదీల్లో కవితను ఢిల్లీలో విచారించింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అఫ్రూవర్​గా మారారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..