AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foods For Mental Health: మనసు స్థిమితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పక తినాలి

శరీరం ఎంత ధృడంగా ఉన్న మానసిక ప్రశాంతత లేకపోతే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. మానసిక స్థితి మెరుగ్గా లేకుంటే ఏ పనీ సవ్యంగా చేయలేరు. మానసిక స్థితి మీ ఆరోగ్యాన్ని మాత్రమే ప్రభావితం చేయదు, ఔమీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా ప్రతి ఒక్కరూ స్ట్రెస్‌తో సతమతమవుతున్నారు. ఆఫీస్ వర్క్‌, ఇంటి నిర్వహణకు సమయపాలన సరిగ్గాలేక గందరగోళానికి గురవుతున్నారు. అయితే మనసు ప్రశాంతంగా..

Foods For Mental Health: మనసు స్థిమితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పక తినాలి
Foods For Mental Health
Srilakshmi C
|

Updated on: Sep 18, 2023 | 12:01 PM

Share

శరీరం ఎంత ధృడంగా ఉన్న మానసిక ప్రశాంతత లేకపోతే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. మానసిక స్థితి మెరుగ్గా లేకుంటే ఏ పనీ సవ్యంగా చేయలేరు. మానసిక స్థితి మీ ఆరోగ్యాన్ని మాత్రమే ప్రభావితం చేయదు, ఔమీ చుట్టూ ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా ప్రతి ఒక్కరూ స్ట్రెస్‌తో సతమతమవుతున్నారు. ఆఫీస్ వర్క్‌, ఇంటి నిర్వహణకు సమయపాలన సరిగ్గాలేక గందరగోళానికి గురవుతున్నారు. అయితే మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి. ఏయే ఆహారాలు తీసుకోవాలి వంటి అనేక ప్రశ్నలకు నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ఆహారాలు మీ కోసం..

నిజానికి మూడ్ కూడా హార్మోన్లకు సంబంధించినదే. సంగీతం వినడం, సినిమా చూడటం వంటి తమకు నచ్చిన పనిని చేసినప్పుడు డోపమైన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడే సెరోటోనిన్‌ను పెంచే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచడంలో ఏయే ఆహారాలు సహాయపడతాయో తెలుసుకుందాం..

డార్క్ చాక్లెట్

శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తిని పెంచాలంటే డార్క్ చాక్లెట్ తినాలి. ఇది మంచి మానసిక స్థితిని నిర్వహించడానికి సహాయపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు అందుకు సహకరిస్తుంది. అయితే వీటిని ఎప్పుడూ పరిమిత మోతాదులోనే తినాలి.

ఇవి కూడా చదవండి

గింజలు, డ్రై ఫ్యూట్స్‌ తినాలి

బాదం, వేరుశెనగ, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు, గుమ్మడి గింజలు మొదలైనవి ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా మానసిక స్థితిని మెరుగుపడుతుంది.

పాలకూర

మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే పాలకూరను ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్నిసార్లు మెగ్నీషియం లోపం వల్ల ఆందోళన, నిరాశ వంటి సమస్యలు తలెత్తుతాయి. పాలకూర సెరోటోనిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

యాపిల్

యాపిల్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పండు మంచి మానసిక స్థితిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆహారంలో యాపిల్స్‌ను తప్పక చేర్చుకోవాలి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.