- Telugu News Photo Gallery Health Benefits Of Peanuts: Eating a handful of peanuts regularly has many benefits
Peanuts Benefits: రోజూ ఖాళీ కడుపుతో గుప్పెడు వేరు శనగలు తిన్నారంటే..
వేరు శనగలు తెలియని వారుండరు. వీటిని పేదవాడి జీడిపప్పు అని కూడా అంటారు. దీనిలోని పోషకాలు జీడిపప్పుకు సమానంగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. రోజు గుప్పెడు వేరు శనగలు నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపుతో తింటే కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. అయితే కేవలం వేరు శనగలు తింటే సరిపోదు. వీటిల్లో దాగున్న పోషకాల గురించి కూడా తెలుసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేరుశెనగల్లో శరీరానికి మేలు చేసే విటమిన్ ఇ, కాపర్ ఫోలేట్ ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో ప్రొటీన్లు, మెగ్నీషియం, ఫైబర్ కూడా..
Updated on: Sep 18, 2023 | 11:39 AM

వేరు శనగలు తెలియని వారుండరు. వీటిని పేదవాడి జీడిపప్పు అని కూడా అంటారు. దీనిలోని పోషకాలు జీడిపప్పుకు సమానంగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. రోజు గుప్పెడు వేరు శనగలు నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపుతో తింటే కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.

అయితే కేవలం వేరు శనగలు తింటే సరిపోదు. వీటిల్లో దాగున్న పోషకాల గురించి కూడా తెలుసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేరుశెనగల్లో శరీరానికి మేలు చేసే విటమిన్ ఇ, కాపర్ ఫోలేట్ ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో ప్రొటీన్లు, మెగ్నీషియం, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి.

వీటిని తినడం వల్ల ఏయే ప్రయోజనాలు కలుగుతాయంటే.. వేరుశెనగలు మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులకు, ముఖ్యంగా ఒలీక్ ఆమ్లానికి మంచి మూలం. అందుకే వేరుశెనగలు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం సహజంగానే తగ్గుతుంది.

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల నిత్యం వేరుశెనగలు తినేవారి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇవి బరువు నియంత్రణలో ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. వేరుశెనగల్లో నియాసిన్ (విటమిన్ B3), ఫోలేట్ (విటమిన్ B9), విటమిన్ E, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలను రక్షించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) పెరగకుండా నియంత్రిస్తుంది. వీటిల్లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఎముకలు బలపడతాయి. స్త్రీలలో కాల్షియం లోపిస్తుంది. కాబట్టి మహిళలు వేరుశనగ పప్పులను ఎక్కువగా తినాలి. అంతేకాకుండా దంతాల సంరక్షణలో కూడా ఇవి సహాయపడతాయి. ఉదయ పూట గుప్పెడు వేరుశనగలు ఖాళీ కడుపుతో తింటే ఫలితాలు వేగంగా ఉంటాయి.





























