- Telugu News Photo Gallery Nauli Yoga: Adiguru Yoga Peetha Guru of Kakinada formed shape of Lord Ganesh with abdominal muscles
Viral Photos: పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా! యోగాతో కళాకండాలు సృష్టిస్తోన్న యోగా గురువు
కాకినాడ స్థానిక ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి యోగాలో చెప్పబడిన నౌలి క్రియ అనే భంగిమ ద్వారా తన పొట్ట కండరాలను వినాయకుని ఆకృతిలో ఏర్పరిచి విఘ్నేశ్వరునిపై తన భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ ప్రక్రియ చూపరులను ఆకట్టుకుంది.మనం ఇప్పటివరకు పేపరు లేదా గోడపై బొమ్మలు వేయడం చూసాం.. కానీ ఎవ్వరు ఇప్పటి వరకు చేయనిరీతిలో పొట్ట కాండరాలపై విభిన్న కళాకృతులు యోగా ద్వారా చూపిస్తున్నారు కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగపీఠానికి..
Updated on: Sep 18, 2023 | 10:29 AM

కాకినాడ స్థానిక ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి యోగాలో చెప్పబడిన నౌలి క్రియ అనే భంగిమ ద్వారా తన పొట్ట కండరాలను వినాయకుని ఆకృతిలో ఏర్పరిచి విఘ్నేశ్వరునిపై తన భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ ప్రక్రియ చూపరులను ఆకట్టుకుంది.

మనం ఇప్పటివరకు పేపరు లేదా గోడపై బొమ్మలు వేయడం చూసాం.. కానీ ఎవ్వరు ఇప్పటి వరకు చేయనిరీతిలో పొట్ట కాండరాలపై విభిన్న కళాకృతులు యోగా ద్వారా చూపిస్తున్నారు కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి.

యోగా శాస్త్రంలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియ ద్వారా ఆయన చేసే విభిన్న ఆకృతులు అందరిని ఆకరిస్తున్నాయి. ముఖ్యంగా పొట్ట కండరాలు పై బొజ్జ గణపయ్యను చూపిన తీరు జాతీయ వార్తల్లో కూడా నిలిసింది. పొట్టపై మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన దృశ్యానికి చూసి ఓరా అనక తప్పదు. పొట్ట కండరాలపై శివ లింగం, పూరీ జగన్నాధుడు ఆయనలోని భక్తికి నిదర్శనాలు.

సమాజానికి చక్కని సందేశాన్ని ఇస్తూ సచ్చిదానంద యోగి వృక్షో రక్షతి రక్షితః అంటూ చెట్టు ఆకృతిని, స్టాప్ స్మోకింగ్ అంటూ ఊపిరితిత్తులు ఆకారాన్ని, యోగా ను ప్రచారం చేస్తూ యోగా డే లోగో ఇలా చెప్పుకుంటు పోతే సుమారు 30కి పై కళా కాండలను తానే సొంతంగా అద్దంలో చూసుకుంటూ తన శరీరంపై రంగులు వేసుకుంటూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

2010లో అనారోగ్యం కారణంగా యోగా లోకి ప్రవేశించిన వీరు వ్యాధి నుండి కొలుకోవడమే కాకా అందరికి యోగా అందించేందుకు సన్యాస దీక్ష తీసుకొని యోగిగా మారారు. యోగాను రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేస్తు వేలాదిమందికి యోగా నేర్పించారు.. 2015లో ఆగ్రాలో జాతీయ స్థాయి యోగ పోటీల్లో బంగారు పతకం, 2016లో శ్రీలంకలో కొలంబో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం పొందారు. వీరు సేవలకు గాను గురుశ్రేష్ఠ, యోగభూషన్ వంటి బిరుదులుతో పాటు.. 2020లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాష్ట్ర ద్వారా ప్రశంస పత్రం ,రజిత పతకం పొందారు. కాగా తాజాగా సచ్చిదానంద యోగి, పొట్టలో యోగాతో చేస్తున్న విభిన్న కళా రూపాలు లండన్ కు చెందిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నారు.
