- Telugu News Photo Gallery Cinema photos Kalyan Ram Devil Movie Producer and Director issue In tollywood Telugu Entertainment Photos
Kalyan Ram – Devil: డైరెక్టర్ పై కోపమా.. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది..?
డెవిల్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది..? దర్శకుడి పేరు ఎందుకు మారిపోయింది..? మొదట్లో పోస్టర్‌పై ఉన్న నవీన్ మేడారం పేరు ఇప్పుడెందుకు మాయమైంది..? డైరెక్టర్ ప్లేస్‌లో నిర్మాత అభిషేక్ నామా పేరెందుకు వచ్చింది..? దర్శకుడు, నిర్మాత మధ్య ఇగో క్లాష్ నడుస్తుందా..? అసలు డెవిల్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది..? బింబిసార విజయంతో కళ్యాణ్ రామ్ ఊపు మీదున్నారు. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్‌తో చేసిన అమిగోస్ ఫ్లాపైనా..
Updated on: Sep 18, 2023 | 1:11 PM

డెవిల్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది..? దర్శకుడి పేరు ఎందుకు మారిపోయింది..? మొదట్లో పోస్టర్‌పై ఉన్న నవీన్ మేడారం పేరు ఇప్పుడెందుకు మాయమైంది..? డైరెక్టర్ ప్లేస్‌లో నిర్మాత అభిషేక్ నామా పేరెందుకు వచ్చింది..?

దర్శకుడు, నిర్మాత మధ్య ఇగో క్లాష్ నడుస్తుందా..? అసలు డెవిల్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది..? బింబిసార విజయంతో కళ్యాణ్ రామ్ ఊపు మీదున్నారు. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్‌తో చేసిన అమిగోస్ ఫ్లాపైనా.. డెవిల్‌తో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు ఈ హీరో.

అయితే ఈ సినిమా విషయంలో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. డెవిల్ షూట్ మొదలు పెట్టినపుడు నవీన్ మేడారం దర్శకుడు.గతంలో ఈయన బాబు బాగా బిజీ సినిమాను అభిషేక్ పిక్చర్స్‌లోనే చేసారు.నవీన్ మేడారం వర్క్ నచ్చి.. డెవిల్ సినిమాను అతడి చేతుల్లో పెట్టారు కళ్యాణ్ రామ్, అభిషేక్ నామా.

అయితే ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక నవీన్ వర్క్ నచ్చకపోవడంతో దర్శక నిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫెరెన్సులు ఎక్కువైపోయానే వార్తలొస్తున్నాయి. అందుకే నవీన్‌ను తొలగించి.. అభిషేక్ నామా సినిమాను డైరెక్ట్ చేసారని తెలుస్తుంది.

డెవిల్ ఫస్ట్ లుక్ వచ్చినపుడు దర్శకుడిగా నవీన్ మేడారం పేరుంది.. ఆ తర్వాత టీజర్‌లో అభిషేక్ నామా అండ్ టీం అని ఉంది.. ఇప్పుడేమో కేవలం అభిషేక్ నామా పేరు మాత్రమే ఉంది. హీరో కూడా నిర్మాతకే సపోర్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ గ్యాప్‌లో ఏం జరిగిందనేది వాళ్లు చెప్పాల్సిందే. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయంలో ఈ మధ్యే విజయ్ దేవరకొండపై వివాదాస్పద కామెంట్స్ చేసిన అభిషేక్.. తాజాగా డెవిల్‌తో మరోసారి కేరాఫ్ కాంట్రవర్సీ అయ్యారు.




