Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram charan – Game Changer: గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ కు తప్పని లీకుల బాధ.. ఫొటోస్.

ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. ఇలాంటి ఇంటి దొంగలే ఇండస్ట్రీలో ఎక్కవైపోతున్నారిప్పుడు. పని చేయండ్రా బాబూ అంటూ ఔట్ పుట్ చేతిలో పెడితే.. దాన్ని తీసుకెళ్లి నెట్‌లో పెట్టేస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ విషయంలో ఇదే జరిగింది. దీనిపై చిత్రయూనిట్ కూడా సీరియస్‌గా స్పందించింది. అసలు ఈ లీక్స్ గొడవేంటి..? ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? మొన్న ప్రాజెక్ట్ కే.. ఈ రోజు గేమ్ ఛేంజర్.. ఈ రోజుల్లో సినిమాలు తీయడం కాదు..

Anil kumar poka

|

Updated on: Sep 18, 2023 | 12:12 PM

ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. ఇలాంటి ఇంటి దొంగలే ఇండస్ట్రీలో ఎక్కవైపోతున్నారిప్పుడు. పని చేయండ్రా బాబూ అంటూ ఔట్ పుట్ చేతిలో పెడితే.. దాన్ని తీసుకెళ్లి నెట్‌లో పెట్టేస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ విషయంలో ఇదే జరిగింది. దీనిపై చిత్రయూనిట్ కూడా సీరియస్‌గా స్పందించింది.

1 / 6
అసలు ఈ లీక్స్ గొడవేంటి..? ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?  మొన్న ప్రాజెక్ట్ కే.. ఈ రోజు గేమ్ ఛేంజర్.. ఈ రోజుల్లో సినిమాలు తీయడం కాదు.. తీసిన సినిమాలు రిలీజ్ వరకు దాచుకోవడమే కష్టమైపోతుంది. తాజాగా గేమ్ ఛేంజర్‌లోని ఆడియో సాంగ్ లీక్ అవ్వడం సంచలనంగా మారింది.

2 / 6
ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చిన ఈ రెండేళ్లలో చాలా లొకేషన్ వీడియోలు కూడా లీకయ్యాయి. ఈ విషయంపై చిత్రయూనిట్ సీరియస్‌గానే ఉన్నారు. వీళ్లపై క్రిమినల్ కేసు ఫైల్ చేసారు. మామూలుగానే లొకేషన్‌లో శంకర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ ఎందుకో మరి గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం ముందు నుంచి లీకులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

3 / 6
ఇప్పుడేకంగా సాంగ్ బయటికి రావడంతో.. ప్రొడక్షన్ హౌజ్ స్పందించింది. ఈ పని చేసిన వాళ్లపై కేసు నమోదు చేసామని.. లీకైన పాటను స్ప్రెడ్ చేయొద్దని కోరారు నిర్మాతలు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వారం రోజుల కింద ప్రాజెక్ట్ కే నుంచి ఇలాగే ఓ వీడియో లీక్ అయింది.

4 / 6
ఎక్కడి వరకో ఎందుకు.. నిన్నటికి నిన్న మహేష్ బాబు గుంటూరు కారం నుంచి కోర్టు దగ్గర షూట్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. ఇక అప్పట్లో సాహోలో ఇంట్రడక్షన్ సీన్.. బాహుబలి 2లోని ఫైట్ సీన్ ఇవన్నీ ఇంటి దొంగల పనులే. పుష్ప 2లో లారీల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వీడియో లీక్ అయింది. సినిమా ఏదైనా లీకుల బెడద మాత్రం తప్పట్లేదు.

5 / 6
పదేళ్ళ కింద అత్తారింటికి దారేది అయితే ఏకంగా ఫస్టాఫ్ అంతా విడుదలకు ముందే లీక్ అయిపోయింది. అప్పట్లో అది పెద్ద సంచలనమే. ఇది కావాలనే కొందరు చేసారని పవన్ కూడా చెప్పారు. మొత్తానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లీకు వీరులు మాత్రం ఆగట్లేదు. అందులో ఇంటి దొంగలే ఎక్కువగా ఉండటం కంగారు పుట్టించే విషయం.

6 / 6
Follow us