Fact Check: ‘ఓటు వేయకుంటే మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 హుష్‌!’ ఈ వార్తలో నిజమెంత..

ప్రజా ప్రతినిధులను ఓటు వేసి గెలిపించుకోవడం ప్రతి సామాన్యుడి హక్కు. త్వరలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు 2023 కూడా జరగనున్నాయి. ప్రస్తుత అధికార ఎన్డీయే, ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఇప్పటికే ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరైనా తమ ఓటు హక్కు వినియోగించుకోకుంటే అతని బ్యాంకు ఖాతా..

Fact Check: 'ఓటు వేయకుంటే మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 హుష్‌!' ఈ వార్తలో నిజమెంత..
Elections
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 18, 2023 | 7:08 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18: ప్రజా ప్రతినిధులను ఓటు వేసి గెలిపించుకోవడం ప్రతి సామాన్యుడి హక్కు. త్వరలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు 2023 కూడా జరగనున్నాయి. ప్రస్తుత అధికార ఎన్డీయే, ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఇప్పటికే ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరైనా తమ ఓటు హక్కు వినియోగించుకోకుంటే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్‌ అవుతాయనేది ఆ వార్త సారాంశం. వచ్చే ఏడాది 2024 లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వార్త తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అసలు ఈ వార్తల్లో నిజమెంత? అనే విషయాని కొస్తే..

ఒక వ్యక్తి ఓటు వెయ్యకపోతే ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు మినహాయించబడుతుందనే వార్తను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్నికల సంఘంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటు వేయని వారిని వారి ఆధార్ కార్డు ద్వారా గుర్తించి, ఆ కార్డుతో అనుసంధానించబడిన వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 మినహాయిస్తారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. కొన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ మళ్లీ వైరల్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎన్నికల సంఘం అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని ఎన్నికల కమిషన్ ప్రతినిధి ట్విటర్‌ ఖాతా ద్వారా తెలియజేసినట్లు పీఐబీ క్లారిటీ ఇచ్చింది.బాధ్యతాయుతమైన పౌరుడిగా ఓటు వేయడం మీ ప్రాథమిక కర్తవ్యం. ఎవరూ ఒత్తిడితోనో, బ్లాక్ మెయిల్ చేయడం వల్లనో ఓటు వేయరాదని కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

కాగా ఓటు వేయకుంటే రూ.350 జరిమానా విధిస్తామని దేశంలో వాట్సాప్ సహా సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇదే విధమైన పుకార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు మరోమారు సామాజిక మాధ్యమాల్లో ఇవి ప్రత్యక్షం కావడంతో ఈ మేరకు ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఫేక్‌ వార్తలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి. ఈ సారి ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ఫేక్‌ వార్తలు పుట్టుకురావడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.