IND vs SL: వికెట్ పడితే రికార్డ్.. 4 పడగొడితే అగ్రస్థానం.. జడేజా, కుల్దీప్‌కి టార్గెట్‌గా మారిన నెహ్రా, కపిల్, ఇర్ఫాన్ రికార్డులు..
IND vs SL, Asia Cup 2023 Final: ఆసియా కప్ 2023 టైటిల్ కోసం ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగే ఆసియా కప్ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు కూడా ఆస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభమాన్ గిల్(275), అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా మహీష్ పతిరణ(11) అగ్రస్థానాల్లో ఉన్నారు. అయితే 2023 టోర్నీపై కాకుండా టోర్నీ చరిత్రలోనే గుర్తుండిపోయే రికార్డ్ సృష్టించేందుకు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా సిద్ధమయ్యారు. ఇంతకీ వారి ఎదుట ఉన్న ఆ రికార్డ్ ఏమిటి..?