IND vs SL: 13 ఏళ్ల తర్వాత మళ్లీ.. అప్పుడు ధోని సక్సెస్, మరీ ఇప్పుడు రోహిత్..? టైటిల్ కోసం హిట్‌మ్యాన్ ఈ లంకను దాటగలడా..?

IND vs SL, Asia Cup 2023 Final: అందరి మదిలో ఉన్నది ఒక్కటే ప్రశ్న.. టైటిల్ కోసం రోహిత్ లంకను దాటగలడా..? సెప్టెంబర్ 12న జరిగిన సూపర్ 4 క్లాష్‌లో యువ ఆటగాళ్లతోనే లంక జట్టు ఓడినా.. భారత్‌కి గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా యువ బౌలర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లు, 42* పరుగులతో రోహిత్ సేనపై చెలరేగాడు. నేటి ఫైనల్ మ్యాచ్‌కి మహీష్ తీక్షణ దూరం అయినా.. ధోని శిష్యుడైన మహీష పతిరణ లంక జట్టులోనే..

IND vs SL: 13 ఏళ్ల తర్వాత మళ్లీ.. అప్పుడు ధోని సక్సెస్, మరీ ఇప్పుడు రోహిత్..? టైటిల్ కోసం హిట్‌మ్యాన్ ఈ లంకను దాటగలడా..?
MS Dhoni Rohit Sharma; IND vs SL Asia Cup 2023 Final
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 17, 2023 | 10:13 AM

IND vs SL: ఆసియా కప్ 2023 వేదికగా భారత్, శ్రీలంక మరో సారి టైటిల్ పోరులో తలపడబోతున్నాయి. ఆసియా కప్ టైటిల్ కోసం ఇరు దేశాల మధ్య ఈ రోజు జరిగే 9వ ఫైనల్ మ్యాచ్‌కి కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. అయితే 2010 తర్వాత, అంటే 13 సంవత్సరాల తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న నేటి టైటిల్ పోరు నేపథ్యంలో ఇప్పుడు అందరి మదిలో ఉన్నది ఒక్కటే ప్రశ్న.. టైటిల్ కోసం రోహిత్ లంకను దాటగలడా..? సెప్టెంబర్ 12న జరిగిన సూపర్ 4 క్లాష్‌లో యువ ఆటగాళ్లతోనే లంక జట్టు ఓడినా.. భారత్‌కి గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా యువ బౌలర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లు, 42* పరుగులతో రోహిత్ సేనపై చెలరేగాడు. నేటి ఫైనల్ మ్యాచ్‌కి మహీష్ తీక్షణ దూరం అయినా.. ఎంఎస్ ధోనికి మరో శిష్యుడైన మహీష పతిరణ లంక జట్టులోనే ఉన్నాడు. కుసల్ మెండీస్, సమర విక్రమ భీకర ఫామ్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 క్లాష్‌లో మెండీస్ అయితే 91 పరుగులతో పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా రాణిస్తుంటే.. స్వదేశంలోనే ఫైనల్ మ్యాచ్ జరగడం లంకకు మాయాబలం కలిగినట్లే.

భారత్, శ్రీలంక మధ్య చివరి సారిగా జరిగిన ఆసియా కప్ 2010 ఫైనల్‌ మ్యాచ్‌లో ధోని సునాయాసంగా నెగ్గగలిగాడు. అప్పుడు గౌతమ్ గంభీర్, దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, సురేష్ రైనా, జడేజా వంటి ప్లేయర్లతో జట్టు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్.. అశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా వంటి బౌలర్లతో పటిష్టంగా ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి వేరే.. జట్టులో రోహిత్, జడేజా ఉన్నా బంగ్లాదేశ్‌పై ఏం జరిగిందో అంతా చూశారు. శుభమాన్ గిల్ సెంచరీతో, అక్షర్ సాహసోపేతమైన పోరాటంతో ప్రయత్నించినా.. రోహిత్ శర్మ డకౌట్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ నిరాశ పరచడం, జడేజా-తిలక్ వర్మ చేతులెత్తేయడం టీమిండియాను గెలుపుకు దూరం చేశాయి.

అయితే ఫైనల్‌ మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ అందుబాటులో ఉన్నప్పటికీ మ్యాచ్ అంతా అతను ఒక్కడే ఆడలేడు. అంటే లంకను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాటాలంటే అతనికి విరాట్ కోహ్లీ సహాయమే కాక అందరి సమిష్టి సహాయ సహకారాలు జట్టుకు అవసరం. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ రాణిస్తున్నా, మిగిలినవారు కూడా లంకను కట్టడి చేయాలి. అలా చేస్తేనే లంకపై రోహిత్ సేన విజయం సాధించగలదు. ఇలా చేయడం ద్వారానే రోహిత్ సేన.. వన్డేల్లో లంక కంటే ఎంతో బలంగా ఉన్న పాకిస్తాన్‌ను సునాయాసం ఓడించింది.

ఆసియా కప్ ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహీష పతిరణ, కసున్ రజిత, సహన్ అరాచిగే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..