- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: change Position and Direction of Wall Clock to avoid all problems
Vastu Tips: గడియారం, వాచ్ విషయంలో తప్పక పాటించాల్సిన నియామాలు.. లేదంటే సమస్యలు తప్పవంటున్న పండితులు..!
Vastu Tips: వైదిక ధర్మంలోని వాస్తు శాస్త్రం ప్రకారం చేతికి ధరించే వాచ్, గోడ గడియారం విషయంలో కూడా వాస్తు నియమాలను అనుసరించాలి. లేదంటే ఇంట్లో వాస్తు దోషాలు కలిగి ఇంట్లోనివారిని ఆరోగ్య, ఆర్థిక సమస్యలను వెంటాడతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి వారి సూచనల మేరకు వాచ్ విషయంలో ఏయే వాస్తు నియమాలు పాటించాలి..? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 18, 2023 | 12:58 PM

దిశ: వాస్తు ప్రకారం ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో గడియారం ఉంటే మంచిది. అలాగే దక్షిణ దిక్కులో గడియారాన్ని అస్సలు పెట్టకూడదు. ఆ దిశలో గడియారం పెడితే ఆర్థిక సంక్షోభం, వృధా ఖర్చులు వెంటాయడతాయి.

సరైన స్థలం: వాస్తు ప్రకారం గడియారం ప్రధాన ద్వారానికి పైన, అలాగే పడుకునే బెడ్డింగ్‌కి ఎదుట ఉండాలి. తలుపులపై, బెడ్ పైన గడియారం ఉండకూడదు. గడియారం అక్కడ ఉంటే ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది.

ఎలాంటి వాచ్..?: ప్రస్తుత మార్కెట్‌లో అనేక రకాల డిజిటల్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటికి బదులుగా ముల్లు ఉన్న వాచ్‌ని ధరించడం మంచిది. ముల్లు నిరంతరం మారుతున్న కాలానికి, జీవితానికి సూచన అది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది.

డిజైన్: మార్కెట్లో అనేక డిజైన్ల వాచ్‌లు అందుబాటులో ఉన్నా.. గుండ్రని వాచ్ ధరించడం, గుండ్రని గడియారమే ఇంట్లో వారికి మంచిది.

రంగు: వాస్తు శాస్త్రం ప్రకారం తెలుపు, క్రీమ్, లేత ఆకు పచ్చ, లేత బూడిద రంగుల్లోని గడియారం లేదా వాచ్ పెట్టుకోవడం ఇంటికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా శ్రేయస్కరం.





























