IND vs AUS: తొలి వన్డేకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. గాయంతో ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం.. ధృవీకరించిన కంగారుల కెప్టెన్..
IND vs AUS ODI Series: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ప్రారంభానికి ఇంకా రెండు వారాలు కూడా లేని సమయంలో భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 22 నుంచి జరిగే ఈ వన్డే సిరీస్ ప్రారంభం కాకముందే కంగారుల జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంతో ఆ జట్టులోని ఆల్‌రౌండర్..
IND vs AUS: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ప్రారంభానికి ఇంకా రెండు వారాలు కూడా లేని సమయంలో భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 22 నుంచి జరిగే ఈ వన్డే సిరీస్ ప్రారంభం కాకముందే కంగారుల జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంతో ఆ జట్టులోని ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ఆటకు దూరం అయ్యారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్రకారం ఆ ఆటగాళ్లు తొలి వన్డేకి దూరం అవుతారు, అయితే రెండో వన్డేకి అందుబాటులో ఉంటారా లేదా అన్నది ఇంకా ప్రశ్నార్థకమే..! ఏదిఏమైనా ప్రస్తుత సమాచారం ప్రకారం రేపు మొహాలీ స్టేడియంలో జరిగే భారత్ vs ఆస్ట్రేలియా తొలి వన్డేకు ఈ ఇద్దరు ఆటగాళ్లు దూరం కానున్నారు. అయితే భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో, ఇంకా ప్రపంచకప్ టోర్నీలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ ఆసీస్ జట్టుకు చాలా కీలకం. పైగా వీరిద్దరికీ భారత్‌పై మంచి రికార్డులే ఉన్నాయి. భారత్‌తో 16 వన్డేలు ఆడిన స్టార్క్ 25 వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ మ్యాక్సీ 29 వన్డేల్లో 921 పరుగులు, 4 వికెట్లు పడగొట్టాడు.
Some positive news on the injury front for Australia with Pat Cummins set to return for tomorrow's first ODI against India, and he's hopeful of playing all three matches in the series!
ఇవి కూడా చదవండిThe skipper also provided updates on Mitchell Starc and Glenn Maxwell | #INDvAUS pic.twitter.com/h2Xk6YZwcJ
— cricket.com.au (@cricketcomau) September 21, 2023
మరోవైపు భారత్ కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లేకుండానే తొలి రెండు వన్డేలను ఆడనుంది. ఈ మేరకు టీమిండియాను తొలి రెండు వన్డేల్లో కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు.
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్..
మొదటి వన్డే – 22 సెప్టెంబర్ – మొహాలీ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం
రెండవ వన్డే – 24 సెప్టెంబర్ – ఇండోర్ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం
మూడో వన్డే – 27 సెప్టెంబర్ – రాజ్‌కోట్ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం