IND VS AUS: కోహ్లీకి అందుకే విశ్రాంతి ఇచ్చారా..? రోహిత్‌కి కూడా అదే కారణమా..? హెడ్ కోచ్ ద్రావిడ్ ఇచ్చిన సమాధానమిదే..
IND vs AUS ODI Series: ఆసీస్‌తో జరిగే తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ వంటి ప్లేయర్లు లేని జట్టును.. అలాగే మూడో వన్డే కోసం వీరితో కూడిన రెండో జట్టును బీసీసీఐ ప్రకటించింది. అంతా బాగానే ఉన్నా కోహ్లీ అభిమానులు, క్రికెట్ అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీని కావాలనే ఆటకు దూరంగా ఉంచుతున్నారని, సచిన్ టెండూల్కర్ రికార్డులను కాపాడేందుకే ఇలా చేస్తున్నారని బీసీసీఐ మీద మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన టీమిండియా హెడ్ కోచ్, మాజీ కెప్టెన్..
IND vs AUS ODI Series: భారత్, ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్ 22 నుంచి 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ శుక్రవారం మొహాలీ వేదికగా జరగనుండగా.. చివరి మ్యాచ్ 27న జరగనుంది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. కేవలం 3 వన్డేల కోసం బీసీసీఐ రెండు జట్లను ప్రకటించింది. తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ వంటి ప్లేయర్లు లేని జట్టును.. అలాగే మూడో వన్డే కోసం వీరితో కూడిన రెండో జట్టును బీసీసీఐ ప్రకటించింది. అంతా బాగానే ఉన్నా కోహ్లీ అభిమానులు, క్రికెట్ అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీని కావాలనే ఆటకు దూరంగా ఉంచుతున్నారని, సచిన్ టెండూల్కర్ రికార్డులను కాపాడేందుకే ఇలా చేస్తున్నారని బీసీసీఐ మీద మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన టీమిండియా హెడ్ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. కోహ్లీతో మాట్లాడిన తర్వాతనే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని, అతను అందుకు అంగీకరించాడని తెలిపాడు. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు విరాట్, కోహ్లీ, కుల్దీప్ వంటి ఆటగాళ్లకు మానసిక, శారీరక విశ్రాంతి అవసరమని.. వారు ప్రశాంతంగా ఉండాలని జట్టు కోరుకుంటోందని ద్రావిడ్ పేర్కొన్నాడు.
https://twitter.com/CricCrazyJohns/status/1704820915513794854/photo/1
Rahul Dravid said, "The team wants Virat Kohli and Rohit Sharma fresh both physically and mentally for the World Cup hence they were rested for the first two ODIs". pic.twitter.com/IiykEdVnRv
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 21, 2023
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్..
మొదటి వన్డే – 22 సెప్టెంబర్ – మొహాలీ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం
రెండవ వన్డే – 24 సెప్టెంబర్ – ఇండోర్ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం
మూడో వన్డే – 27 సెప్టెంబర్ – రాజ్‌కోట్ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం