AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaheen Afridi: మళ్లీ పెళ్లి చేసుకున్న షాహీన్‌ ఆఫ్రిది.. హాజరైన కెప్టెన్ బాబర్ అజామ్.. రెండోసారి వివాహం ఎందుకంటే..?

Shaheen Afridi: అఫ్రిదీ- అన్షా వివాహ వేడుకకు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్ సహా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అలాగే రెండో సారి వివాహం చేసుకుంటున్న షాహిన్ అఫ్రిదీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. ‘ అల్లా మనల్ని జంటగా సృష్టించి, ఒకరిని మరొకరు ప్రేమించేలా..

Shaheen Afridi: మళ్లీ పెళ్లి చేసుకున్న షాహీన్‌ ఆఫ్రిది.. హాజరైన కెప్టెన్ బాబర్ అజామ్.. రెండోసారి వివాహం ఎందుకంటే..?
Shaheen Afridi Ansha Afridi
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 20, 2023 | 10:07 AM

Share

Shaheen Afridi: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ మళ్లీ వివాహం చేసుకున్నాడు. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిదీ కూతురు అన్షా అఫ్రిదీతో సెప్టెంబర్‌ 19న కరాచీలో వీరిద్దరి వివాహం అంగరంగవైభవంగా రెండో సారి నిఖా చేసుకున్నాడు. షాహీన్ అఫ్రిదీ- అన్షా అఫ్రిదీ జంటకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం జరిగినా.. ఈ క్రికెటర్ బిజీ షెడ్యూల్ కారణంగా అత్యంత సన్నిహితుల మధ్యనే నిర్వహించడం సాధ్యమైంది. దీంతో అందరి ముందు మళ్లీ ఘనంగా పెళ్లి చేసుకోవాలని షాహీన్ అఫ్రిదీ- అన్షా అఫ్రిదీ జంట భావించింది. ఈ మేరకు మంగళవారం మరోసారి నిఖా జరిగింది. అఫ్రిదీ- అన్షా వివాహ వేడుకకు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్ సహా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అలాగే రెండో సారి వివాహం చేసుకుంటున్న షాహిన్ అఫ్రిదీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. ‘ అల్లా మనల్ని జంటగా సృష్టించి, ఒకరిని మరొకరు ప్రేమించేలా చేస్తాడు. ఇస్లాం ప్రకారం త్వరగా వివాహం చేసుకొని, మీ భాగస్వామితో సంతోషంగా జీవించండి. హరామ్ రిలేషన్స్‌కి దూరంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

షాహీన్ అఫ్రిదీ- అన్షా అఫ్రిదీ

వివాహ వేడుకలో బాబర్ అజామ్.. 

బాబర్ అజామ్, షాహిద్ అఫ్రిదీ, షాహీన్ అఫ్రిదీ

కాగా, ఇటీవల జరిగిన ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ చేతులెత్తేసినా.. షాహీన్ ఆఫ్రిదీ మెరుగ్గా ఆడాడు. టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి