Asia Cup 2023 Final: అజారుద్దీన్, ధోని సరసన చేరిన రోహిత్ శర్మ.. భారత్ క్రికెట్ చరిత్రలో మూడో కెప్టెన్‌గా అరుదైన రికార్డ్..
IND vs PAK, Asia Cup 2023 Final: ఆదివారం అందరూ చూస్తుండగా 116 నిముషాల వ్యవధిలోనే రోహిత్ సేన లంకను దాటేసింది. అప్పటి వరకు బలంగా ఉన్న శ్రీలంకను.. బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన రోహిత్ జట్టు దాటగలదా అని సందేహించినవారికి ఆశ్చర్యం కలిగేలా ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. మహ్మద్ సిరాజ్ 6, హార్దిక్ పాండ్యా 3, జస్ర్పీత్ బూమ్రా ఓ వికెట్ తీయడంతో లంక 50 పరుగులకే ఆలౌట్ కాగా.. 51 రన్స్ లక్ష్యాన్ని ఆ వెంటనే ఇషాన్ కిషన్ 23*, శుభమాన్ గిల్ 27* పరుగులతో 6.1 ఓవర్లలోనే చేధించారు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డ్‌ను సాధించడంతో పాటు.. మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోని సరసన సమంగా నిలిచాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5