Health Tips: సంతానలేమితో బాధపడుతున్నారా..? ఈ పండ్లను తీసుకున్నారంటే మీ స్టామినా డబుల్..
Health Tips: ఉద్యోగ, వైవాహిక బాధ్యతలతో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన కారణంగా చాలా మందిలో శృంగార సామర్థ్యం, లైంగిక కోరికలు క్షీనిస్తున్నాయని పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి. తల్లిదండ్రులు కావాలనుకున్నవారికి ఇది పెద్ద శాపంగా మారుతోంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు పోషకాహారంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజా కూరగాయలతో పాటు పండ్లను కూడా తీసుకోవాలి.
Updated on: Sep 20, 2023 | 7:16 AM

అవకాడో: బీటా కెరోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలను కలిగిన అవోకాడో కామోద్దీపన పండుగా ప్రసిద్ధి. పురుషుల్లో శృంగార సామర్థ్యం పనిచేస్తుంది.

అత్తిపండ్లు: అంగస్తంభన లక్షణాలను నిరోధించడంలో అత్తి పండ్లను దివ్యౌషధంగా పనిచేస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో అత్తిపండ్లు ఉపయోగకరంగా ఉంటాయి.

దానిమ్మ: రక్తహీనతను దూరం చేయడానికి పనిచేసే దానిమ్మలోని పోషకాలు లైంగిక శక్తిని మెరుగుపరిచే లక్షణాలను కూడా కలిగి ఉంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి.

స్ట్రాబెర్రీలు: లైంగిక సామర్థ్యం పెంచే ఆహారాల్లో స్ట్రాబెర్రీలు కూడా ఉన్నాయి. ఈ పండ్లలో సంతానోత్పత్తి, శృంగార సామార్థ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పుష్కలంగా ఉంటాయి.

బీన్స్: కిడ్నీ, డయాబెటీస్ రోగులకు మేలు చేసే బీన్స్ సంతానోత్పత్తిని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి. వీటిల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ, గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.





























