IND vs AUS: వరల్డ్ కప్‌కి ముందు భారత్-ఆస్ట్రేలియా సిరీస్.. వన్డేల్లో ఎవరి అధిపత్యం కొనసాగుతుందంటే..?

IND vs AUS, ODI: భారత్‌తో తలపడేందుకు ఆసీస్ ఒక జట్టునే ప్రకటించగా.. వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ పలువురు ఆటగాళ్లకు తొలి 2 మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పిస్తూ సిరీస్‌ కోసం రెండు జట్లను ప్రకటించింది. ఈ మేరకు తొలి రెండు వన్డేల్లో కేఎల్ రాహుల్.. మూడో వన్డేకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను నడిపిస్తారు. అయితే.. భారత్ vs ఆస్ట్రేలియా వన్డే రికార్డులు ఎలా ఉన్నాయి..? ఎవరిపై ఎవరు అధిపత్యం..

IND vs AUS: వరల్డ్ కప్‌కి ముందు భారత్-ఆస్ట్రేలియా సిరీస్.. వన్డేల్లో ఎవరి అధిపత్యం కొనసాగుతుందంటే..?
India Vs Australia
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 20, 2023 | 8:12 AM

IND vs AUS, ODI Series: భారత్ వేదికగా జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయమే మిగిలి ఉంది. అక్టోబర్ 5 నుంచి ప్రారభమయ్యే మెగా టోర్నీలో రోహిత్ నేతృ‌త్వంలోని టీమిండియా ఆక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తన తొలి మ్యాచ్ ఆడుతోంది. అలా ప్రపంచకప్‌లోకి ప్రవేశిస్తుంది. ఇదిలా ఉండగా.. మెగా టోర్నీ ప్రారంభానికి ముందే టీమిండియా‌తో ఆసీస్ భారత్ వేదికగానే ఓ వన్డే సరీస్‌లో తలపడనుంది. సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు ఇరు దేశాల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరగనుంది. ఇక ఈ సిరీస్ కోసం అటు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇటు బీసీసీఐ తమ తమ జట్లను కూడా ప్రకటించాయి.  భారత్‌తో తలపడేందుకు ఆసీస్ ఒక జట్టునే ప్రకటించగా.. వరల్డ్ కప్ నేపథ్యంలో బీసీసీఐ పలువురు ఆటగాళ్లకు తొలి 2 మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పిస్తూ సిరీస్‌ కోసం రెండు జట్లను ప్రకటించింది. ఈ మేరకు తొలి రెండు వన్డేల్లో కేఎల్ రాహుల్.. మూడో వన్డేకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాను నడిపిస్తారు. అయితే.. భారత్ vs ఆస్ట్రేలియా వన్డే రికార్డులు ఎలా ఉన్నాయి..? ఎవరిపై ఎవరు అధిపత్యం చలాయిస్తున్నారు..? తెలుసుకుందాం..

43 ఏళ్లుగా వన్డే క్రికెట్‌లో తలపడుతున్న భారత్‌, ఆస్ట్రేలియా జట్లు మొత్తం 146 మ్యాచ్‌లు ఆడాయి. వీటిల్లో భారత్ కేవలం 54 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. 82 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాదే విజయం కాగా.. మరో 10 మ్యాచ్‌లు ఫలితం లేకుండానే రద్దయ్యాయి. వీటిల్లో భారత్ వేదికగా మొత్తం 67 మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియా 30, ఆసీస్ 32 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అలాగే భారత్, ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్ 22 నుంచి జరగబోయే సిరీస్ వరల్డ్ కప్ 2019-వరల్డ్ కప్ 2023 మధ్య కాలంలో నాలుగోది కాగా.. జరిగిన మూడు సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా 2, భారత్ 1 గెలిచింది. అంటే ఇలా కూడా భారత్‌పై ఆసీస్‌దే పైచేయి. ఈ లెక్కను 2-2గా సమం చేయాలంటే జరగబోయే సిరీస్‌లో ఆసీస్‌ను టీమిండియా తప్పక ఓడించాలి.

ఇక ఇరు జట్లు ఆడిన తమ తమ చివరి సిరీస్ లేదా టోర్నీలపై ఓ లుక్ వేస్తే.. సౌతాఫ్రికా పర్యటను వెళ్లిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అలాగే భారత్ ఆసియా కప్‌లో ఆడి.. 8వ సారి టోర్నీ విజేతగా నిలిచింది. ఆసియా కప్ విజయోత్సాహంలో ఉన్న టీమిండియా.. ఆస్ట్రేలియాను కూడా ఓడిస్తే మరింత మానసిక స్థైర్యంతో ప్రపంచకప్‌ను ప్రారంభిస్తుంది. ఒకవేళ జరగబోయే వన్డే సిరీస్‌లో భారత్ ఓడితే.. ఆ ఓటమి ప్రభావం వన్డే వరల్డ్ కప్‌పై పడే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్..

మొదటి వన్డే – 22 సెప్టెంబర్ – మొహాలీ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం

రెండవ వన్డే – 24 సెప్టెంబర్ – ఇండోర్ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం

మూడో వన్డే – 27 సెప్టెంబర్ – రాజ్‌కోట్ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం

వన్డే సిరీస్ కోసం ఇరు జట్లు:

తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్‌మద్ బుమ్రాహ్, జస్ప్రీతమ్‌మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మూడో వన్డేకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ., అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, అష్టన్ అగర్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మిచ్ మార్ష్, సీన్ అబాట్, కెమెరాన్ గ్రీన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..