హైదరాబాద్‌కు వచ్చేసిన ‘వరల్డ్‌కప్ ట్రోఫీ’.. జరగబోయే మ్యాచ్‌ల వివరాలు ఇవే..
మన ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మరే ఆటకు లేని బజ్ క్రికెట్ సొంతం.. భారతీయులకు ఈ క్రీడను పరమావధిగా భావిస్తూ ఉంటారు. అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న భారత్‌లో ఈసారి వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 జట్ల మధ్య ఈ క్రికెట్ వార్..
మన ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మరే ఆటకు లేని బజ్ క్రికెట్ సొంతం.. భారతీయులకు ఈ క్రీడను పరమావధిగా భావిస్తూ ఉంటారు. అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న భారత్‌లో ఈసారి వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 జట్ల మధ్య ఈ క్రికెట్ వార్ ఇండియా వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఫైనల్ మ్యాచ్ గెలిచే జట్టు వరల్డ్‌కప్ ట్రోఫీను అందుకోనుంది. ఇక ఒక్కసారైనా ట్రోఫీను కళ్లారా చూడాలనుకునే వారు కోట్లలో ఉంటారు. అటువంటి వారి కోసం, క్రికెట్‌ను మరింత దగ్గరికి.. ప్రేక్షకులకు చేర్చేందుకు ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ టూర్‌ను ప్రారంభించింది.
జూన్ 27న భారత్లో ట్రోఫీని ప్రదర్శించారు. జూన్ 27 నుంచి ప్రారంభమైన ఈ టూర్‌లో వరల్డ్ కప్ ట్రోఫీ దాదాపు నాలుగు నెలల పాటు వివిధ దేశాలు తిరిగింది. భారత్ నుంచి ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ఇంగ్లాండ్.. ఆ వెంటనే పాకిస్తాన్.. నెక్స్ట్ బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలలోనూ వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శించారు..పాకిస్థాన్‌లో జూలై 31 నుంచి ఆగష్టు 4 వరకు వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శించగా.. జనాలు దాన్ని చూసేందుకు తండోపతండాలుగా విచ్చేశారు. 18 దేశాలలో ఈ వరల్డ్ కప్ ట్రోఫీని ఐసీసీ ప్రదర్శించింది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ట్రోఫీని భారత్‌లోనే ఉంచారు. ఇప్పటికే చెన్నైలో ఐసీసీ ట్రోఫీని ప్రదర్శించగా.. తాజాగా వరల్డ్ కప్ ట్రోఫీ హైదరాబాద్‌కు చేరుకుంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రజలు దీన్ని చూసేందుకు ఉంచారు.
6 వారాల పాటు ప్రపంచంలోని 10 అత్యుత్తమ జట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నందున దేశవ్యాప్తంగా ఉత్సాహం పెరుగుతోంది. క్రికెట్ దేశంలోని అందరినీ ఒకటిగా చేస్తుంది” అని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా అన్నారు. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతుంది. మొత్తం ఉప్పల్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. వీటిలో రెండు వార్మప్ మ్యాచ్‌లు కాగా.. మూడు వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఐదు మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌వే ఉండటం విశేషం.
మరోవైపు సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న 3 వన్డే సిరీస్.. ఐసీసీ ర్యాంకింగ్‌ను నిర్ణయించనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ముందుగా ఏ జట్టు నెంబర్ వన్ స్థానాన్ని అధిగమిస్తుందో.. ఈ సిరీస్ నిర్ణయిస్తుంది.
1. 🇵🇰 2. 🇮🇳 3. 🇦🇺
The #INDvAUS series will decide who will be No.1 in the @MRFWorldwide ICC Men’s ODI Team Rankings heading into #CWC23 😲https://t.co/x3HITUouT6
— ICC (@ICC) September 21, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..