AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: రైతు బిడ్డ కోటీశ్వరుడు! లగ్జరీ కార్లు, బిగ్‌ హౌస్‌ కూడా! ప్రశాంత్‌ తండ్రి ఏమన్నారో తెలుసా?

రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్.. ప్రస్తుతం ఈ రెండు పేర్లు సోషల్‌ మీడియాలో మార్మోగుతున్నాయి. కామన్‌ మ్యాన్‌ కోటాలో మొదటిసారిగా రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి రాకముందే అతనికి నెట్టింట భారీగా క్రేజ్‌ ఉంది. 'మళ్లోచ్చినా' అంటూ ఎప్పుడూ అన్నదాతల బాధలను ఏకరువు పెట్టే ప్రశాంత్‌కు ఫ్యాన్‌ బేస్‌ బాగానే ఉంది. అందుకే పట్టుబట్టి మరీ బిగ్‌బాస్ 7 సీజన్‌లోకి అడుగుపెట్టాడు. హౌజ్‌లోకి అడుగుపెట్టడమే లేటు.. ఓ బియ్యం బస్తా పట్టుకెళ్లి నాగార్జునకు బహుమతిగా ఇచ్చాడు

Pallavi Prashanth: రైతు బిడ్డ కోటీశ్వరుడు! లగ్జరీ కార్లు, బిగ్‌ హౌస్‌ కూడా! ప్రశాంత్‌ తండ్రి ఏమన్నారో తెలుసా?
Pallavi Prashanth Family
Basha Shek
|

Updated on: Sep 22, 2023 | 3:39 PM

Share

రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్.. ప్రస్తుతం ఈ రెండు పేర్లు సోషల్‌ మీడియాలో మార్మోగుతున్నాయి. కామన్‌ మ్యాన్‌ కోటాలో మొదటిసారిగా రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి రాకముందే అతనికి నెట్టింట భారీగా క్రేజ్‌ ఉంది. ‘మళ్లోచ్చినా’ అంటూ ఎప్పుడూ అన్నదాతల బాధలను ఏకరువు పెట్టే ప్రశాంత్‌కు ఫ్యాన్‌ బేస్‌ బాగానే ఉంది. అందుకే పట్టుబట్టి మరీ బిగ్‌బాస్ 7 సీజన్‌లోకి అడుగుపెట్టాడు. హౌజ్‌లోకి అడుగుపెట్టడమే లేటు.. ఓ బియ్యం బస్తా పట్టుకెళ్లి నాగార్జునకు బహుమతిగా ఇచ్చాడు. ఇక హౌజ్‌లో కూడా బాగానే ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు ప్రశాంత్‌. గేమ్స్‌, టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం బిగ్‌బాస్‌కు బాగా కంటెంట్‌అందిస్తోన్న హౌజ్‌మేట్స్‌లో పల్లవి ప్రశాంత్‌ కూడా ఒకరని చెప్పవచ్చు. ఇక హౌజ్‌ బయట కూడా రైతు బిడ్డకు భారీగా మద్దతు లభిస్తోంది. నామినేషన్స్‌లోనూ భారీగా ఓట్లు పోలవుతున్నాయి. ఇదే సమయంలో నెగెటివిటీ కూడా వస్తోంది. చివరకు తోటి కంటెస్టెంట్టే రైతుబిడ్డను టార్గెట్‌ చేస్తున్నారు. పదే పదే రైతు బిడ్డ అని చెప్పుకుంటూ సింపతీ క్రియేట్ చేసుకున్నాడంటూ ప్రశాంత్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అందుకే సెకండ్ వీక్ నామిషన్స్ లో అమర్ దీప్, రతికా రోజ్, ప్రియాంక, తేజా, శివాజీతో పాటు చాలామంది కంటెస్టెంట్లు రైతుబిడ్డను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలతో రైతుబిడ్డ క్రేజ్‌ తగ్గకపోగా మరింత పెరుగుతోంది.

హౌస్‌లో ఇలా ఉంటే సోషల్‌ మీడియాలో పల్లవి ప్రశాంత్‌ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రశాంత్‌ అసలు పేదవాడు కాదని అతనికి కోట్లాది రూపాయల ఆస్తులున్నాయంటున్నారు చాలామంది. మొత్తం 26 ఎకరాల భూమి, నాలుగు ఖరీదైన కార్లు, లగ్జరీ హౌస్‌ ఉందంటూ ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ రూమర్లపై పల్లవి ప్రశాంత్‌ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ తండ్రి మాట్లాడుతూ ‘మా వాడి గురించి పనికిరాని వార్తలు ప్రచారం చేస్తున్నారు. 26 ఎకరాల పొలం, నాలుగు కార్లు, పెద్ద భవనాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ నిజంగా అవన్నీ ఉంటే మా అబ్బాయి బిగ్‌బాస్‌కు ఎందుకు వెళతాడు? నాలుగు కార్లు ఉంటే పెద్ద ఉద్యోగమే చేసుకునేవాడు కదా? అసలు మావాడికి 26 ఎకరాల పొలం ఎక్కడున్నాయో చూపించండి. మాకున్నదల్లా కేవలం ఆరెకరాల పొలం మాత్రమే! దాన్ని అందరికీ పంచితే ప్రశాంత్‌కు కేవలం రెండెకరాలు వస్తాయంతే. నా బిడ్డపై చిన్నచూపు చూస్తుంటే చాలా బాధేస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో రైతుబిడ్డ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.