Bigg Boss 7 Telugu: సీరియల్ బ్యాచ్ టార్గెట్.. పాపం యావర్.. గుండె పగిలేలా ఏడుస్తూ నిస్సహాయంగా..
ఉల్టా పుల్టా అంటే ఈ సీజన్ కాస్త ఆసక్తిగా ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ కష్టపడి గెలిచినవాళ్లను ఓడిపోయారంటూ ప్రకటించడం.. అసలు అర్హులు కానీ వారిని టాస్కులకు పంపడం చూస్తుంటే గత సీజన్స్ మాదిరిగానే సాగినట్లుగా కనిపిస్తోంది. . ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ప్రిన్స్ యావర్ బాధ చూస్తే ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యేలా ఉన్నారు. ఎంతో కష్టపడి సహనంతో టాస్క్ కంప్లీట్ చేస్తే అర్హుడు కాదంటూ పోటీ నుంచి తప్పించారు సీరియల్ బ్యాచ్. ఇద్దరమ్మాయిలతో మాటలతో వాదించలేక తప్పుకున్నాడు యావర్.
బిగ్బాస్ చెప్పేదానికి.. చేసేదానికి అసలు పొంతనే లేదు. పవర్ అస్త్ర కోసం కంటెస్టెంట్లను పోటీపడమంటాడు. అంతలోనే వారిలో వారికే విన్నర్ ఎవరో తెల్చేయాలంటాడు. ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో బిగ్బాస్ షోపై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పోయిందనే చెప్పాలి. ఉల్టా పుల్టా అంటే ఈ సీజన్ కాస్త ఆసక్తిగా ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ కష్టపడి గెలిచినవాళ్లను ఓడిపోయారంటూ ప్రకటించడం.. అసలు అర్హులు కానీ వారిని టాస్కులకు పంపడం చూస్తుంటే గత సీజన్స్ మాదిరిగానే సాగినట్లుగా కనిపిస్తోంది. . ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ప్రిన్స్ యావర్ బాధ చూస్తే ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యేలా ఉన్నారు. ఎంతో కష్టపడి సహనంతో టాస్క్ కంప్లీట్ చేస్తే అర్హుడు కాదంటూ పోటీ నుంచి తప్పించారు సీరియల్ బ్యాచ్. ఇద్దరమ్మాయిలతో మాటలతో వాదించలేక తప్పుకున్నాడు యావర్.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. శివాజీ ముందు కూర్చొని యావర్ ఎమోషనల్ అయ్యాడు. నా బ్రదర్ నాకు ఈ అగ్రెషన్ (ఆవేశం) ఇచ్చాడు. అప్పట్లో మా అమ్మ దగ్గర 100 రూపాయాలు కూడా లేవు సార్.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గుండెల్లో దాగిన బాధను బయటపెట్టాడు. యావర్ కన్నీళ్లు చూసి శివాజీకి కూడా బాధ అనిపించింది. యావర్ దేవుడు నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చాడు. నీ టైమ్ వస్తుంది. గుర్తు పెట్టుకో అంటూ శివాజీ ధైర్యం చెప్పాడు.
View this post on Instagram
ఇక మూడవ పవరాస్త్ర గెలుచుకోవడానికి ప్రియాంక జైన్, శోభా శెట్టి పోటీ పడ్డారు. వీళ్లకు ఎద్దుపై ఎక్కువ సేపు రైడ్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఎక్కువ సేపు ఎవరైతే ఎక్కువసేపు రైడ్ చేస్తారో వాళ్లే మూడవ పవరాస్త్ర గెలుచుకుంటారని.. వారికి మూడు వారాల ఇమ్యూనిటీ వస్తుందని చెప్పారు బిగ్బాస్. ఇక ప్రోమో చూస్తుంటే ప్రియాంక ముందుగా బుల్ పై రైడ్ చేసింది. ఆ తర్వాత శోభా బుల్ పై కూర్చుంది. అయితే కాసేపటికే శోభా పడిపోగా.. ఎక్కువ సేపు ప్రియాంక ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మూడవ పవర్ అస్త్ర కోసం పోటీ పడాల్సిన వారిలో ప్రిన్స్ యావర్ ఉన్నాడు. కానీ ప్రియాంక, శోభా కలిసి ప్రిన్స్ అర్హుడు కాడంటూ అతడిని గేమ్ నుంచి తప్పించారు. మొత్తానికి సీరియల్ బ్యాచ్ దెబ్బకు యావర్ అన్యాయం జరిగిందనే చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.