Bigg Boss Season 7: పాపం యావర్‌ 🥲.. ఆడాళ్లతో పెట్టుకున్నాడు.. ఎక్కి ఎక్కి ఏడ్చాడు 😭. అమర్‌ దీప్ ఇజ్జత్‌ పాయే 😜..

EXcept - ఓ పక్క మూడో పవరాస్త్ర కోసం పోటీ పడుతున్న ముగ్గురు సభ్యులు.. వారిని అనుసంధానం చేస్తూ.. ఓ సంచాలకుడు. ఆ పక్కనే వీళ్ల మధ్య సాగుతున్న పోటీని.. మాటల యుద్ధాన్ని చూస్తూ.. కూర్చున్న హౌస్‌ మేట్స్. అలా కూర్చున్న వారి మైండ్‌లో మెదులుతున్న ప్లాన్స్. వీళ్లను కంట్రోల్ చేస్తూ.. ఆదేశాలిచ్చే బిగ్ బాస్. ఇలా ఎక్కడికక్కడ 20th ఎపిసోడ్ కూడా.. ఇంట్రెస్టింగానే సాగింది. వచ్చే నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగడం ఖాయమనే హింట్ ఇచ్చింది.

Bigg Boss Season 7: పాపం యావర్‌ 🥲.. ఆడాళ్లతో పెట్టుకున్నాడు.. ఎక్కి ఎక్కి ఏడ్చాడు 😭. అమర్‌ దీప్ ఇజ్జత్‌ పాయే 😜..
Bigg Boss 7
Follow us
Subhash Goud

|

Updated on: Sep 23, 2023 | 12:08 AM

యూట్యూబ్‌లో బీబీ రిలేటెడ్ స్టోరీస్..కుప్పలు తెప్పులుగా వస్తున్న వేళ.. ఈ సారి బీబీ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ కూడా.. అదే రేంజ్‌లో అసలేమాత్రం తగ్గకుండా కంటెంట్ ఇస్తూనే ఉన్నారు. వారి వారి పరిధిలో గేమ్ ఆడుతూనే ఉన్నారు. అందర్నీ ఇప్పటి వరకు అయితే ఈ షోకు ఎంగేజ్ అయ్యేలా చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఎపిసోడ్ అంటే.. 20th ఎపిసోడ్‌లోనూ అదే చేశారు.

ఓ పక్క మూడో పవరాస్త్ర కోసం పోటీ పడుతున్న ముగ్గురు సభ్యులు.. వారిని అనుసంధానం చేస్తూ.. ఓ సంచాలకుడు. ఆ పక్కనే వీళ్ల మధ్య సాగుతున్న పోటీని.. మాటల యుద్ధాన్ని చూస్తూ.. కూర్చున్న హౌస్‌ మేట్స్. అలా కూర్చున్న వారి మైండ్‌లో మెదులుతున్న ప్లాన్స్. వీళ్లను కంట్రోల్ చేస్తూ.. ఆదేశాలిచ్చే బిగ్ బాస్. ఇలా ఎక్కడికక్కడ 20th ఎపిసోడ్ కూడా.. ఇంట్రెస్టింగానే సాగింది. వచ్చే నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగడం ఖాయమనే హింట్ ఇచ్చింది.

ఇక మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ సినిమాలోని ‘థార్ మార్ థక్కర్ మార్’ సాంగ్‌తో.. బీబీ హౌస్‌లోని కంటెస్టెంట్స్ డ్యాన్స్‌తో వెరీ ఎనర్జటిక్‌గా.. షో మొదలవుతుంది. ఇక ఆ కాసేపటికే సుబ్బు..రైతు బిడ్డ ఫన్ షరూ అవుతుంది. గౌతమ్‌తో ప్రేమలో ఉన్నావ్ కదాని రైతు బిడ్డ సుబ్బుకు సైగ చేస్తూ చెప్పగా.. రతికతో నువ్వు మాత్రం ప్రేమలో లేవా ఏంటని.. అనేలా సైగలతోనే కౌంటర్ ఇస్తుంది సుబ్బు.

ఇక ఇంతలో బిగ్ బాస్ సందీప్, యావర్, శోభ, ప్రియాంకలను గార్డెన్ ఏరియాకు రమ్మని ఆదేశిస్తాడు. అలా అనౌన్స్ చేస్తూ… అమర్‌ దీప్‌కు దిమ్మతిరిగే పంచ్‌ వేస్తాడు. మూడో కంటెండర్‌ అమర్‌ దీప్ అని పిలిచి. కాదు కాదు.. ప్రియాంక అంటూ.. బిగ్‌ బాస్ అమర్‌ను దెప్పిపొడుస్తాడు. ఇక ఆ తరువాత అసలు టాస్క్‌ ఏంటో చెప్పి గార్డెన్ ఏరియాలో ఉన్న కంటెండర్స్‌తో పాటు.. లోపల కూర్చుని చూస్తున రిమైనింగ్ హౌస్‌ మేట్స్‌కు కూడా దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తాడు.

మూడవ పవరాస్త్ర కోసం సాధించేందేకు మీ ముగ్గురు ఎంతో కష్టపడ్డారని.. చెప్పిన బిగ్ బాస్ .. అయితే పవరాస్త్ర పోరులో నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్లి పోటీపడేది ఇద్దరే అని.. ఆ ఇద్దరి డిసైడ్ చేసేది మీ ముగ్గురే అంటూ… కంటెండర్స్ మధ్యలో దిమ్మతిరిగే మెలిక పెడతాడు. మీ ముగ్గురిలో వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరో మెజారిటీ ద్వారా నిర్ణయించుకుని.. అప్పటికే బిగ్ బాస్ ఏరియాలో పెట్టిన వీకెస్ట్ కంటెస్టెంట్ బొమ్మను.. ఆ ఇద్దరూ కలిసి పగలగొట్టాలని చెబుతాడు.

ఇక ఆ తరువాత సంచాలక్ సందీప్‌ ఆద్వర్యంలో.. డిస్కషన్ స్టార్ట్ చేసిన ముగ్గురు కంటెండర్స్‌.. ఎవరు స్ట్రాంగ్ .. ఎవరు వీక్ అంటూ.. గట్టిగా వాదించుకుంటూ ఉంటే.. మరో పక్క హౌస్‌లో కూడా.. ఇదే డిస్కషన్ జరుగుతుంది. అయితే హౌస్‌లో ఉన్న వాళ్లు అయితే.. ప్రిన్స్‌ పక్కకు వస్తే అయిపోతుంది కదాని అనుకుంటూ ఉంటారు.

కానీ బయట ఉన్న కంటెండర్స్‌ మాత్రం పోటా పోటీగా అరుచుకుంటూనే ఉంటారు. అందులో ప్రిన్స్ యావర్.. మళ్లీ అదే పనిగా తన స్టైల్లో అరుస్తూ.. నానా హంగామా చేస్తుంటారు. శోభ కూడా తనుకు తీసిపోని విధంగా.. తన స్టాండ్ మీదే ఉంటుంది. ప్రిన్స్ పక్కకు పెట్టాలని వాదిస్తుంటుంది. అలా ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఓటు వేసుకుంటారు. దీంతో ప్రియాంక డెసీషన్ మేకర్ అయిపోతుంది. అయితే శోభ, యావర్ ఇద్దరికీ పాయింట్స్ ఉన్నాయని.. ఎవర్నీ వీక్ అనాలో తెలియట్లేదని.. చెబుతూనే.. చాలా డిస్కషన్ తర్వాత.. ప్రిన్స్‌ వీక్ అని తన ఆన్సర్ చెబుతుంది ప్రియాంక. ఇక ప్రియాంక నోటి నుంచి తన పేరు రావడాన్ని తట్టుకోని ప్రిన్స్ యావర్ మరో సారి తన టెంపర్ కోల్పోతాడు. అరుస్తూ.. ప్రియాంకపై మాటల దాడికి దిగుతాడు. కానీ అవేమీ పట్టించుకోని ప్రియాంక శోభ.. యావర్ బొమ్మను పగలగొట్టి ఫైనల్ టాస్క్ కు వెళతారు. ఇక మరో పక్క బిగ్ బాస్ ప్రాపర్టీని పగలగొట్టి .. అగ్రెసివ్ అయిన యావర్. ఆ తరువాత మళ్లీ ఏడుపు అందుకుంటాడు. శివాజీని కౌగిలించుకుని మరీ వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఎందుకు ‘నేనంటే అందరికీ ఎందుకు భయం’ అంటూ.. ఫీలవుతుంటాడు. ప్రాపర్టీ డ్యామేజ్ జేసినందుకు బిగ్ బాస్‌కు సారీ చెబుతాడు.

ఇక ఈక్రమంలోనే శివాజీతో తన పర్సనల్ ప్రాబ్లమ్స్‌ షేర్ చేసుకుంటాడు ప్రిన్స్. బిగ్ బాస్ లోకి రావడానికి కూడా లోన్ పెట్టానని.. క్లోత్స్ కొనేందుకు కూడా తన బ్రదర్ దగ్గర డబ్బులు తీసుకున్నానని.. తన దగ్గర అసలు డబ్బే లేదని.. అందుకు ఈ అగ్రెషన్… గెలవాలనే కోపం ఉందంటూ.. ఏడుస్తూ శివాజీకి చెబుతాడు. తన మాటలతో.. ఏడుపుతో.. బీబీ ఆడియెన్స్‌ను కూడా ఫీలయ్యేలా చేస్తాడు.

ఇక యాక్టివిటీ ఏరియలో యాంగ్రీ బుల్ సెటప్ చేసిన బిగ్ బాస్.. కంటెండర్స్గా ఫైనల్ అయిన శోభ,ప్రియాంకను రమ్మని ఆదేశిస్తాడు. కంటెండర్స్ ఇద్దరూ బుల్ పై సవారీ చేస్తూ.. దాదాపు మూడు రౌండ్లు ఆడాల్సి ఉంటుంది. మూడు రౌండ్ల సమయాన్ని కన్సిడెర్ చేసి.. ఎవరు ఎక్కువ బుల్‌ రైడ్ చేస్తారో వారే మూడవ పవరాస్త్ర విజేతలంటూ.. చెబుతాడు. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య సాగిన రసవత్తర గేమ్‌లో .. కాస్త ప్రియాంకనే ఎక్కువ సేపు బుల్ రైడ్ చేసినట్టు కనిపిస్తారు. కానీ ఆ తరువాత రంగంలోకి వచ్చిన బిగ్ బాస్ మరో సారి ట్విస్ట్ ఇస్తాడు. ఎవరు విజేత అనేది చెప్పకుండా.. వీకెండ్ షోలో నాగార్జున చెబుతారంటూ.. అనౌన్స్ చేసి మ్యూట్‌కెళ్లిపోతాడు. అలా ఈ ఎపిసోడ్ ముగిసిపోయి.. మరుసటి ఎపిసోడ్ పై తెలియని క్యూరియాసిటీని పెంచుతుంది.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి