Krishna Mukunda Murari Episode September 23rd, 2023: కృష్ణను దెబ్బకొట్టడానికి ముకుంద కంత్రీ ప్లాన్ .. సాయం చేసిన అలేఖ్య..

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారీ సీరియల్ ప్రేమ, పెళ్లి మధ్య సాగుతున్న కథ. బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. కృష్ణకు ముకుంద ప్రేమ విషయం తెలుస్తుంది. దీంతో తన కాపురాన్ని నిలబెట్టుకొలనుకున్న కృష్ణ హాస్పటల్ కు లాంగ్ లీవ్ పెడుతుంది. అదే కనుక నిజం అయితే కృష్ణ ఇంక ఈ ముసుగులో గుద్దులాట వద్దు.. డైరెక్ట్ గా తేల్చుకుందాం నువ్వే నేను అని ఛాలెంజ్ చేసుకుంటుంది ముకుంద..ఈ రోజు సెప్టెంబర్ 23 వ తేదీ ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో చూద్దాం..

Krishna Mukunda Murari Episode September 23rd, 2023: కృష్ణను దెబ్బకొట్టడానికి ముకుంద కంత్రీ ప్లాన్ .. సాయం చేసిన అలేఖ్య..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Sep 25, 2023 | 7:00 AM

భవానీ సరే కృష్ణ .. రేవతి, సుమలత, అలేఖ్య అందరూ రేపు భర్తల దినోత్సవానికి రెడీ చేయండి అని చెబుతుంది. కృష్ణ ఫోకస్ అంతా నామీదనే పెడుతుంది ఎందుకు.. తాను ఎంతో కష్టపడి సాధించిన డాక్టర్ జాబ్ కు కూడా లాంగ్ లీవ్ పెట్టింది. పైగా ప్రతి సారీ ఆదర్శ్ మ్యాటర్ తీసుకొస్తుంది. ఎందుకు ప్రతిసారీ నామీద ఫోకస్ పెట్టింది. అని ఆలోచిస్తుంటే.. అలేఖ్య తనకు చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. ముసుగులో గుద్దులాట ఎందుకు డైరెక్ట్ గా తనో నేనో తేల్చుకుంటాం..  ఏసీపీ సార్ కు సేవ చేస్తూ ముకుందని ఇంకా ఉడికిస్తుంది. నీకు తగిన గుణపాఠం నేను చెబుతా ముకుంద సిద్ధంగా ఉండు అని కృష్ణ అనుకుంటే.. కృష్ణ ముందు ఓడిపోకూడదు.. నా ప్రేమ గెలవాలి అనుకుంటుంది ముకుంద.

మురారీ చిన్నప్పటి ఫోటోతో ఆటాడుకున్న కృష్ణ

మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది ఏసీపీ సార్.. అంటే కొంపదీసి ముకుంద మా మ్యాటర్ గురించి చెప్పేసిందా ఏమిటి..అనుకుంటుంటే.. మీ భాగోతం అంతా ఈ ఫొటోలో ఉంది అంటే.. ముకుంద ఫామ్ హౌస్ లో మా లద్దక్ ఫోటోలు పంపించిందా ఏమిటి అని అనుకుంటే.. కృష్ణ మరి హిసించడం బాగుందని.. ఒక ఫోటో చూపిస్తుంది. మురారీ చిన్నతనంలో ఫోటో చూపించి ఓ రేంజ్ లో ఆటాడుకుంటుంది. చివరికి కృష్ణ దగ్గర నుంచి ఫోటో తీసుకుని ఇది నీకు మా అమ్మ ఇచ్చింది కదా ఎవరికి దొరకకుండా దాచుకుంటా అని తీసుకుని వెళ్తాడు మురారీ..

ఏప్రిల్ లో భర్తల దినోత్సవం..

కృష్ణను భవానీ పిలిచి భర్తల దినోత్సవము ఏప్రిల్ లో అయితే.. సెప్టెంబర్ లో అని ఎందుకు అబద్ధం చెప్పావంటే.. ముకుంద కోసం పెద్దత్తయ్య.. ఆదర్శ్ కోసం తను అన్ని పనులు నేర్చుకుంటుంది కదా ఆదర్శ్ వచ్చేలోపల ఆదర్శ్ ఇష్టాలన్నీ తెలుసుకుని ముకుందకు ఆదర్శ్ లోకంగా చేద్దామని అనుకున్న పెద్దత్తయ్యా అని అంటుంటే… నాకు భర్తల దినోత్సవం ఏప్రిల్ లో అని తెలిసినా అందరి ముందు నిన్ను ఎందుకు అడగలేదు తెలుసా.. నువ్వు ఏపని చేసినా అందులో ఒక అర్ధం ఉంటుంది అని నేను నమ్ముతాను భవానీ చెబుతుంది. మీతో అబద్దం చెప్పినందుకు సారీ అని అంటుంటుంటే.. మంచి పనులు చెయ్యడానికి చిన్న చిన్న అబద్ధాలు చెబితే తప్పులేదు.

ఇవి కూడా చదవండి

అలేఖ్యతో కలిసి ప్లాన్ వేసిన ముకుంద

నువ్వు చెప్పింది నిజమే అలేఖ్య మా ప్రేమ విషయం కృష్ణకు తెల్సింది. అందుకే ఈ భర్తల దినోత్సవం ప్లాన్ చేసింది. నాకు అర్ధం కానీ విషయం ఏమిటంటే.. నేను మురారీని ప్రేమించాను.. మురారీ కూడా నన్ను ప్రేమించాడు అని తెలిసి కృష్ణ సిగ్గు లేకుండా ఎలా భార్యగా ఉండాలనుకుంటుంది .. మీ ఇద్దరి తన కారణంగా విడిపోలేదు కాబట్టి.. తెలిసి తెలిసి తన కాపురాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలని అందుకుంటుంది అని అలేఖ్య అంటే.. నువ్వు నా సైడా లేక తన సైడా అని అలేఖ్యని నిలదీస్తుంది ముకుంద.. ఇప్పుడే అసలు పోరు మొదలవుతుంది.. రణమో శరణమో నిర్ణయించుకోవాల్సింది కృష్ణే అంటుంటే.. అలేఖ్య అబ్బా ఏమి చెప్పావు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంది.

కృష్ణకు హెల్ప్ చేస్తున్న మధు..

ఏసీపీ సార్ కు ఇష్టమైన ప్రతి వస్తువు తన దగ్గర ఉండలని మధుని అడుగుతుంది కృష్ణ.. రేపు భర్తల దినోత్సవానికి కావాల్సిన వస్తువులు తీసుకుని రా అని ఒక లిస్ట్ ఇస్తుంది. అప్పుడు మధు.. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఇంతగా ప్రేమిస్తుందని నిన్ను చూస్తే అర్ధం అవుతుంది కృష్ణ.. నువ్వు భార్యగా రావడం మా మురారీ అదృష్టం కృష్ణ అంటాడు మధు. ఇంత పెద్ద కుటుంబంలో ఇంత మంచి ఫ్యామిలీకి నేను కోడలిగా రావడం నా అదృష్టం అని అంటే.. మధు మా కృష్ణ బంగారం అని అంటాడు.

ముకుంద కంత్రీ ప్లాన్..

రేవతి పూజ చేసిన తర్వాత అందరికి ప్రసాదం ఇస్తూ.. కృష్ణ చేతిలో ప్రసాదం పెట్టి.. దీనిని భార్య భర్తలు ఇద్దరూ ఖచ్చితంగా తినమని అని చెబుతుంది. తన చేతిలో ప్రసాదం ఎలాగైనా మురారీతో తినిపించాలి ప్లాన్ వేసిన ముకుందకు సాయం చేసిన అలేఖ్య. మధు అలేఖ్యల రగడలో కృష్ణ చేతిలో ప్రసాదం కింద పడిపోతుంది. అప్పుడు ముకుంద తన చేతిలో ప్రసాదాన్ని తినమని ఇస్తుంది.

సోమవారం ఎపిసోడ్ లో

ఆదర్శ్ ఫోటోని పట్టుకున్న మురారీని చుసిన ముకుంద.. సాయం చేసిన అలేఖ్య..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..