AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఓటింగ్‏లో యావర్‏కు పట్టం కట్టిన అడియన్స్.. ఎలిమినేట్ కంటెస్టెంట్ ఫిక్స్..

కంటెండర్ అయ్యేందుకు శారీరక, మానసిక హింసను భరించిన ప్రిన్స్ యావర్‏ను పక్కకు పెట్టేశారు శోభా శెట్టి, ప్రియాంక జైన్. దీంతో గుండె పగిలేలా ఏడుస్తూ అల్లాడిపోయాడు యావర్. ఇక అంతకు ముందు చికెన్ ముక్కలు తినాలనే టాస్కులో తుప్పాస్ సంచాలక్ సందీప్ నిర్ణయంతో గౌతమ్ కృష్ణకు అన్యాయం జరిగిందన్న సంగతి తెలిసిందే. అందరి కంటే ముందే చికెన్ ముక్కలు తిన్నప్పటికీ సరిగ్గా తినలేదని.. అందుకే ఓడిపోయాడంటూ కొత్త వాదన తీసుకువచ్చాడు సందీప్. మొత్తానికి అనుకున్నట్లుగానే శోభా శెట్టిని కంటెండర్ టాస్క్ కోసం పోటీ పడేందుకు అర్హురాలు అంటూ నిర్ణయించేశాడు.

Bigg Boss 7 Telugu: ఓటింగ్‏లో యావర్‏కు పట్టం కట్టిన అడియన్స్.. ఎలిమినేట్ కంటెస్టెంట్ ఫిక్స్..
Bigg Boss 7 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 23, 2023 | 10:13 AM

Share

గత రెండు రోజులుగా బిగ్‏బాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయనడంలో సందేహమే లేదు. కష్టపడితే కాదు.. మేము కావాలనున్న వాళ్లనే గెలిపించుకుంటామని అంటున్నారు కంటెస్టెంట్స్. కంటెండర్ అయ్యేందుకు శారీరక, మానసిక హింసను భరించిన ప్రిన్స్ యావర్‏ను పక్కకు పెట్టేశారు శోభా శెట్టి, ప్రియాంక జైన్. దీంతో గుండె పగిలేలా ఏడుస్తూ అల్లాడిపోయాడు యావర్. ఇక అంతకు ముందు చికెన్ ముక్కలు తినాలనే టాస్కులో తుప్పాస్ సంచాలక్ సందీప్ నిర్ణయంతో గౌతమ్ కృష్ణకు అన్యాయం జరిగిందన్న సంగతి తెలిసిందే. అందరి కంటే ముందే చికెన్ ముక్కలు తిన్నప్పటికీ సరిగ్గా తినలేదని.. అందుకే ఓడిపోయాడంటూ కొత్త వాదన తీసుకువచ్చాడు సందీప్. మొత్తానికి అనుకున్నట్లుగానే శోభా శెట్టిని కంటెండర్ టాస్క్ కోసం పోటీ పడేందుకు అర్హురాలు అంటూ నిర్ణయించేశాడు. ఇదిలా ఉంటే.. వీకెండ్ వచ్చేసింది. మూడవ వారంలో నామినేట్ అయిన ఇంటి సభ్యులు ఒకరు బయటకు వచ్చే సమయం వచ్చేసింది.

ఇక మొదటి రెండు రోజులు ఓటింగ్ లెక్కలు ఎలా ఉన్నా.. ఆ తర్వాత టాస్కులలో ఆట తీరు.. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ప్రవర్తనను జనాలు చూస్తూనే ఉన్నారు. ప్రేమ పక్షులకు.. వంటలక్కలకు.. కండల వీరులకు.. ఒక్కొక్కరికి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్‏లో ఓటింగ్ ఇచ్చారు. యావర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడించింది రతిక. మరోవైపు యావర్ కు తెలుగు రాదంటూ మానసికంగా టార్చర్ చేసింది దామిని. అయినప్పటికీ అన్నింటిని భరించి కంటెండర్ అయ్యేందుకు పోటీ పడ్డాడు యావర్. దీంతో శాడిస్టులుగా మారిపోయారు రతిక, దామినిలు. ప్రిన్స్ నోట్లో పేడ నీళ్లు కొట్టారు. పాంట్లో ఐస్ ముక్కులు వేసి చిత్రహింసలకు గురిచేశారు. వాటన్నింటిని సహనంగా భరించి టాస్క్ గెలిచినప్పటికీ శోభా, ప్రియాంక కలిసి పోటీ నుంచి పక్కను పడేశారు.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

కానీ శారీరక, మానసిక చిత్రహింసను భరించిన యావర్ కు మాత్రం జనాలు పట్టం కట్టారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ప్రిన్స్ కు అత్యధిక ఓటింగ్ ఇచ్చి అతడిని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. ఇక అమర్ దీప్ కు మూడో స్థానాన్ని ఇచ్చారు. ఈవారం చికెన్ ముక్కలు తిని అన్యాయంగా బలైపోయిన గౌతమ్ కృష్ణకు ఎక్కువగానే ఓటింగ్ ఇచ్చి ప్రిన్స్ తర్వాతి స్థానంలో నిలబెట్టారు. ప్రిన్స్ మొదటి స్థానంలో.. గౌతమ్ కృష్ణ రెండవ స్థానంలో ఉండగా.. అమర్ దీప్ మూడవ స్థానానికి పరిమితమయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ నాల్గవ స్థానంలో.. రతిక ఐదవ స్థానంలో.. ఉండగా.. ఆరు, ఏడు స్థానాల్లో మాత్రం దామిని, శుభ శ్రీ ఉన్నారు. అయితే మూడో వారం ఇంట్లో నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ఈవారం ఆమెకు అతి తక్కువ ఓటింగ్ వచ్చింది. దీంతో ఈ వారం సింగర్ బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..