Bigg Boss 7: ప్రిన్స్ యావర్ నెత్తిన పాలు పోసిన బిగ్ బాస్.. సీరియల్ బ్యాచ్‌కు ఇక మూడిందే..

కొంచెం తెలుగు నేర్చుకునేందుకు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి యావర్. కేవలం ఇంగ్లీషు మాట్లాడితే.. కొంతమంది చదువుకోని వాళ్లకు అర్థం కాదు. తను చెప్పే పాయింట్ కరెక్ట్ అయినా కానీ.. జనాలకి అర్థం అవ్వకపోతే ఎఫర్ట్స్ అంతా వృథా అవుతాయి. ప్రజంట్ అయితే యావర్‌ టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ చిన్న, చిన్న మార్పులు చేసుకుంటే మాత్రం.. అతడికి తిరుగుండదు.

Bigg Boss 7: ప్రిన్స్ యావర్ నెత్తిన పాలు పోసిన బిగ్ బాస్.. సీరియల్ బ్యాచ్‌కు ఇక మూడిందే..
Prince Yawar
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 23, 2023 | 12:35 PM

బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. క్యాలిక్లేషన్స్ మారిపోతున్నాయ్. అస్సలు తెలుగురాని ప్రిన్స్ యావర్ ఆడియెన్స్ ఫేవరెట్ అయిపోయాడు. బజ్ పెంచేందుకు బిగ్ బాస్ టీమ్ చేసిన ప్రయోగాలు అతడికి ప్లస్ అయ్యాడు. అదేంటి.. అందరూ యావర్‌కి అన్యాయం జరిగింది అంటుంటే.. మీరు ప్లస్ అంటున్నారు అనుకుంటున్నారా..?.. లోపల గెలిచినోళ్లు కాదు విన్నర్.. బయట జనాల హృదయాల్ని గెలిచేనోళ్లే ఎప్పుడైనా బిగ్ బాస్ విజేతలు అవుతారా.. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు ప్రిన్స్ మరో కౌశల్ అయ్యాడని చెప్పవచ్చు. కనీసం బేసిక్‌ తెలుగు పదాలు కూడా రాని యావర్‌ను వీక్షకులు ఓన్ చేసుకుంటున్నారంటే కారణం.. అతడు అందరి చేత టార్గెట్ చేయబడటమే. టాస్కులు బాగా ఆడుతున్న సీరియల్ బ్యాచ్ అతడ్ని టార్గెట్ చేస్తున్నారని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. అందుకు బిగ్ బాస్ కొన్ని నిర్ణయాలు కూడా కారణం అని చెప్పాలి. అయితే వారేమి అతడిపై ప్రేమ ఉండి.. చేసినవి కాదు. జనరల్‌గా షో బజ్ కోసం తీసుకున్న నిర్ణయాలు.. యావర్ హైప్ అయ్యేందుకు సాయపడ్డాయి.

ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్ వ్యక్తి యావర్. ఏ టాస్కు ఇచ్చినా దుమ్ము లేపుతాడు. అంతేకాదు.. తనకు అన్యాయం జరిగినప్పుడు గొంతుతో మీద పడతాడు. అదే అతడికి ప్లస్సుగా మారింది. అయితే యావర్.. ఆడియెన్స్ డేంజరస్ స్నేక్‌గా చెబుతున్న రతిక మాయలో ఉన్నాడు. అదొక్కటే అతడికి మైనస్. ఏదో ట్రాక్ కోసం ట్రై చేస్తూ.. కంటెంట్ వస్తుందని భావిస్తున్నాడో ఏమో కానీ.. ఆమె వెన్నుపోటు పొడిచినా కూడా తన చుట్టూనే తిరుగుతున్నాడు. కాస్త ముందు ముందు యావర్.. ఆమెను వదిలేసి ఆటపై మరింత ఫోకస్ పెంచితే.. కచ్చితంగా విన్నర్ అవుతాడన్నది వ్యూయర్స్ వెర్సన్.

అంతేకాదు.. కొంచెం తెలుగు నేర్చుకునేందుకు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి యావర్. కేవలం ఇంగ్లీషు మాట్లాడితే.. కొంతమంది చదువుకోని వాళ్లకు అర్థం కాదు. తను చెప్పే పాయింట్ కరెక్ట్ అయినా కానీ.. జనాలకి అర్థం అవ్వకపోతే ఎఫర్ట్స్ అంతా వృథా అవుతాయి. ప్రజంట్ అయితే యావర్‌ టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ చిన్న, చిన్న మార్పులు చేసుకుంటే మాత్రం.. అతడికి తిరుగుండదు. ఇక సెప్టెంబర్ 22న ప్లే అయిన ఎపిసోడ్‌లో అతడికి అన్యాయం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే. వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరో మీరే నిర్ణయించండని.. కంటెండర్స్ అయిన.. శోభా, ప్రియాంక, యావర్‌లను కోరాడు బిగ్ బాస్. విచిత్రంగా.. శోభా, ప్రియాంక.. యావర్ వీకెస్ట్ అని అనౌన్స్ చేసి… సేఫ్ గేమ్ ఆడారు. దీంతో యావర్ బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక యావర్ తన బాధను, తన ఆర్ఠిక పరిస్థితిని, తనకు బిగ్ బాస్ ఇంట్లో జరుగుతున్న అన్యాయాన్ని.. శివాజీతో పంచుకున్నప్పుడు చాలామంది కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

View this post on Instagram

A post shared by Prince Yawar (@princeyawar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు