7/G Brundavan Colony: 18 ఏళ్లైన తగ్గని క్రేజ్.. ‘7/G బృందావన కాలనీ’ సినిమాను మిస్ చేసుకున్న హీరోస్ వీళ్లే..
తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్. మొదటి రోజే ప్రేక్షకులకు ఈ మూవీ కనెక్ట్ కావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. కానీ యూత్‌కు మాత్రం త్వరగానే కనెక్ట్ అయ్యింది. మొదటి చూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడిన రవి.. చూసే చూపులకు.. చేసే పనులు పొంతనే ఉండదు. తన ప్రవర్తనతో అటు హీరోయిన్ కు.. ఇటు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాడు.
2004 అక్టోబర్ 15న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘7G బృందావన కాలనీ’. అప్పట్లో ఈ సినిమాకు ఓ రెంజ్ కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు 18 ఏళ్ల క్రితం ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్. మొదటి రోజే ప్రేక్షకులకు ఈ మూవీ కనెక్ట్ కావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. కానీ యూత్‌కు మాత్రం త్వరగానే కనెక్ట్ అయ్యింది. మొదటి చూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడిన రవి.. చూసే చూపులకు.. చేసే పనులు పొంతనే ఉండదు. తన ప్రవర్తనతో అటు హీరోయిన్ కు.. ఇటు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాడు.
కానీ ప్రేమించిన అమ్మాయి చనిపోయినా తనను ఆరాధించడం మానడు. మరణించిన తర్వాత కూడా ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి కథ అంతకు ముందు ఎప్పుడూ రాలేదు. దీంతో ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ తండ్రి, కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలను ఈ మూవీలో చూపించారు. ఈ చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో రవికృష్ణ. ఈ సినిమాతోనే కథానాయికుడిగా అరంగేట్రం చేశాడు రవికృష్ణ.
View this post on Instagram
ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్లు గడుస్తున్నా ఈ మూవీకి ఆదరణ మాత్రం తగ్గలేదు. అయితే ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రవికృష్ణ కాదట. ముందుగా ఈ కథకు ఆర్. మాధవన్.. సూర్య వంటి స్టార్ హీరోస్ అనుకున్నారట. కానీ అప్పటికే వాళ్ల డేట్స్ ఖాళీ లేకపోవడంతో సిద్ధార్థ్ ను సంప్రదించగా.. అతను మరో సినిమాతో బిజీగా ఉన్నాడట. దీంతో డైరెక్టర్ సెల్వ రాఘవన్ రవికృష్ణను హీరోగా చేద్ధాం అనుకున్నారట. అలా మొదటి చిత్రానికే హీరోగా పెద్ద విజయం అందుకున్నారు రవికృష్ణ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.