Krrish 4 Movie: హృతిక్ రోషన్ క్రిష్ 4 సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదా.. ఇంకో ఏడాది డిలే పడినట్టేనా..
బాలీవుడ్ మ్యాన్లీ హంక్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సిరీస్ క్రిష్. ఇప్పటికే మూడు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫోర్త్ ఇన్‌స్టాల్మెంట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయినా ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపించటం లేదు. హాలీవుడ్‌లో మాత్రమే కనిపించే సూపర్ హీరో కథలను ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేసిన సినిమా క్రిష్. కోయి మిల్‌గయాతో స్టార్ట్ అయిన ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Sep 23, 2023 | 12:29 PM

బాలీవుడ్ మ్యాన్లీ హంక్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సిరీస్ క్రిష్. ఇప్పటికే మూడు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫోర్త్ ఇన్‌స్టాల్మెంట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయినా ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపించటం లేదు.

హాలీవుడ్‌లో మాత్రమే కనిపించే సూపర్ హీరో కథలను ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేసిన సినిమా క్రిష్. కోయి మిల్‌గయాతో స్టార్ట్ అయిన ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. ఫోర్త్ పార్ట్ కూడా చాలా రోజుల కిందటే ఎనౌన్స్ అయ్యింది. కానీ వరుస ఇబ్బందులతో క్రిష్ 4 డిలే అవుతోంది.

సినిమా ఎనౌన్స్ అయిన కొద్ది రోజులకే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాకేష్ రోషన్ హెల్త్ పాడైంది. దీంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆగిపోయింది. ఆయన కోలుకొని తిరిగి వర్క్ స్టార్ట్ చేసే టైమ్‌కి కోవిడ్ ఎఫెక్ట్ పడి సినిమా డిలే అయ్యింది. ఆ మధ్య క్రిష్ సిరీస్‌కు 15 ఇయర్స్ అంటూ ఓ వీడియో టీజర్ వదిలింది మూవీ టీమ్. అప్పటి నుంచే క్రిష్ 4 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా రీ స్టార్ట్ అయ్యింది.

ప్రజెంట్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా షూటింగ్‌లో ఉన్న హృతిక్ రోషన్, ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే క్రిష్ 4ను కూడా పట్టాలెక్కించాలని ప్లాన్ చేశారు. కానీ సడన్‌గా వార్ 2 ఓకే అవ్వటంతో క్రిష్ 4 మరోసారి వాయిదా పడింది. వార్ 2 భారీ యాక్షన్ థ్రిల్లర్ కావటంతో దాదాపు ఏడాది పాటు ఆ సినిమా మీద వర్క్ చేయబోతున్నారు హృతిక్. అంటే అప్పటి వరకు క్రిష్ పట్టాలెక్కే ఛాన్స్ లేదన్నమాట.

ఈ డిలేను ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవాలనుకుంటోంది క్రిష్ టీమ్. స్క్రిప్ట్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను మరింత పక్కాగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వన్స్ హృతిక్ సెట్‌లో అడుగుపెడితే ఏ మాత్రం డిలే లేకుండా సినిమాను కంప్లీట్ చేసేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.





























