- Telugu News Photo Gallery Cinema photos Kareena Kapoor makes interesting comments about audience expectations
Karina Kapoor: డిజిటల్‌లోనూ సత్తా చాటనున్న కరీనా.. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్..
43ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను రూల్ చేస్తున్న బ్యూటీ కరీనా కపూర్. వెండితెర మీద స్టార్ ఇమేజ్‌ను అందుకున్న ఈ భామ ఇప్పుడు డిజిటల్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ గురించి కామెంట్ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో కొనసాగుతున్న కరీనా కపూర్ ప్రజెంట్ సినిమా సిచ్యుయేషన్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అసలు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు..? సినిమా మేకింగ్‌లో ఎలాంటి మార్పులు రావాలి? అన్న విషయాలపై స్పందించారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Sep 23, 2023 | 11:56 AM

43ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను రూల్ చేస్తున్న బ్యూటీ కరీనా కపూర్. వెండితెర మీద స్టార్ ఇమేజ్‌ను అందుకున్న ఈ భామ ఇప్పుడు డిజిటల్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ గురించి కామెంట్ చేశారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో కొనసాగుతున్న కరీనా కపూర్ ప్రజెంట్ సినిమా సిచ్యుయేషన్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అసలు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు..? సినిమా మేకింగ్‌లో ఎలాంటి మార్పులు రావాలి? అన్న విషయాలపై స్పందించారు.

థియేటర్, ఓటీటీ అన్న తేడాలు ఆడియన్స్ చూడరన్నది కరీనా వర్షన్. కంటెంట్ బాగుంది అంటే ఏ ప్లాట్ ఫామ్‌లో ఉన్న కంటెంట్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని గట్టిగా చెబుతున్నారు.

ఓ కామన్ ఆడియన్‌కు ఫైనల్‌గా కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అందుకే ముందు బాలీవుడ్ అలాంటి కంటెంట్ మీద కాన్సన్‌ట్రేట్ చేయాలంటున్నారు బెబో.

జానే జానా వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన కరీనా, ప్రజెంట్ నార్త్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న కంటెంట్ విషయంలో హ్యాపీ అన్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో చేంజెస్ వస్తున్నాయన్న ఈ బ్యూటీ, యంగ్ జనరేషన్ కొత్త కథలతో ప్రయోగాలు చేస్తుందని.. అలాంటి వారిని మరింతగా ప్రొత్సహిస్తే ఇండస్ట్రీ భవిష్యుత్తు మరింత బాగుంటుందని చెప్పారు.





























