Agent OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. 5 నెలల తర్వాత ఓటీటీలోకి అఖిల్‌ ‘ఏజెంట్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌కు మోక్షం కలిగింది. ఏప్రిల్‌ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. థియేటర్లలో విడుదలైన సుమారు 5 నెలల తర్వాత ఏజెంట్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అధికారికంగా ఖరారైంది. అఖిల్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వివరాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సదరు ఓటీటీ సంస్థ ఏజెంట్‌ ట్రైలర్‌ను షేర్‌ చేసింది.

Agent OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. 5 నెలల తర్వాత ఓటీటీలోకి అఖిల్‌ 'ఏజెంట్‌'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Agent Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 22, 2023 | 7:24 PM

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌కు మోక్షం కలిగింది. ఏప్రిల్‌ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. థియేటర్లలో విడుదలైన సుమారు 5 నెలల తర్వాత ఏజెంట్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అధికారికంగా ఖరారైంది. అఖిల్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వివరాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సదరు ఓటీటీ సంస్థ ఏజెంట్‌ ట్రైలర్‌ను షేర్‌ చేసింది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్‌ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి మరో కీలక పాత్రలో మెరిశారు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చింది.ఈ సినిమా కోసం అఖిల్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. సిక్స్‌ప్యాక్‌తో కనిపించాడు. అయితే ఆశించిన స్థాయిలో కథా కథనాలు లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద ఏజెంట్‌ చతికిలపడిపోయాడు. కాగా అఖిల్‌ సినిమాను డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌ కొనుగోలు చేసింది. మొదట మే 19న ఓటీటీలో ఏజెంట్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అయితే ఎందుకోగానీ సోనీలివ్‌ వెనక్కు తగ్గింది. జూన్‌లో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అది కూడా జరగలేదు. అప్పటి నుంచి ఏజెంట్ ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై వార్తలు వస్తున్నా కానీ ఏవీ నిజం కాలేదు. సినిమాలోని కొన్ని అనవసర సన్నివేశాలను తొలగించారని, అలాగే కొత్త సీన్లను కూడా జోడించి సరికొత్త వెర్షన్‌ తో ఓటీటీ రిలీజ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సోనీలివ్‌ కానీ, ఏజెంట్ మేకర్స్‌ కానీ ఎప్పుడూ ఈ వార్తలపై స్పందించలేదు. అయితే ఎట్టకేలకు సెప్టెంబర్‌ 29 నుంచి అఖిల్‌ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనన్నట్లు అధికారికంగా ఖరారైంది. మరి ఓటీటీలో ఏ వెర్షన్‌ విడుదలవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించిన ఏజెంట్ సినిమాలో బాలీవుడ్ నటుడు డీనో మోరియా విలన్‌గా నటించాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంపత్‌ రాజ్‌, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, అనిష్‌ కురువిల్లా, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయ్యారా? ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా ఏజెంట్‌ తర్వాత మరే సినిమాను ప్రకటించలేదు అఖిల్‌.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ ..

View this post on Instagram

A post shared by Sony LIV (@sonylivindia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!