RDX OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ.. ‘ఆర్‌డీఎక్స్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సహజత్వానికి, ఎమోషన్స్‌కు పెద్దపీట వేసే మలయాళ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్‌తో పాటు ఇతర భాషల్లోనూ మలయాళ సినిమాలు రిలీజై వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఓటీటీలో మలయాళ సినిమాలదే హవా. తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పలు ఓటీటీ సంస్థలు తమ సినిమాలను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా ఇటీవల విడుదలైన 2018, పద్మిని, జర్నీ ఆఫ్ 18 ప్లస్ లవ్ తదితర సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది
సహజత్వానికి, ఎమోషన్స్‌కు పెద్దపీట వేసే మలయాళ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్‌తో పాటు ఇతర భాషల్లోనూ మలయాళ సినిమాలు రిలీజై వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఓటీటీలో మలయాళ సినిమాలదే హవా. తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పలు ఓటీటీ సంస్థలు తమ సినిమాలను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా ఇటీవల విడుదలైన 2018, పద్మిని, జర్నీ ఆఫ్ 18 ప్లస్ లవ్ తదితర సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడొక మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి రానుంది. అదే ఆర్‌డీఎక్స్: రాబర్ట్ డోనీ జేవియర్. ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ధాటికి అదే రోజు విడుదలైన దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త, నివీన్ పౌలీ సినిమాలు పక్కకు వెళ్లి పోయాయి. సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా ఒక కేరళలోనే రూ. 40 కోట్ల కలెక్షన్లు రావడం విశేషం. అలాగే అన్ని భాషల్లోనూ కలిపి రూ. 85 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆర్‌డీఎక్స్ సినిమాపై ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ వంటి తారలు ప్రశంసలు కురిపించడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఆర్‌డీఎక్స్ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఆశ్చర్యకరంగా థియేటర్లలో విడుదలైన నెలరోజుల్లోపే ఈ బ్లాక్ బస్టర్ సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 24) నుంచే ఆర్‌డీఎక్స్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఓటీటీ సంస్థ.
ప్రస్తుతం మలయాళంలో మాత్రమే ఆర్‌డీఎక్స్ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగు వెర్షన్‌పై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే వెంటనే చూడాలనుకుంటే మాత్రం సబ్‌టైటిల్స్‌తో ఈ బ్లాక్ బస్టర్‌మూవీని చూసేయచ్చు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో షేన్ నిగమ్, ఆంటోని వర్గీస్, నీరజ్ మాధవ్ కీలక పాత్రలు పోషించారు. మహిమా నంబియార్, ఐమా సెబాస్టియ్, లాల్, బాబు ఆంటోని, మాలా పార్వతి ఇతర పాత్రల్లో మెరిశారు. నహాస్ హిదాయత్ అనే డైరెక్టర్ మొదటిసారి మెగాఫోన్ పట్టి ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్‌పై సోఫియా పాల్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Robert, Dony and Xavier are coming to set your screens on fire🔥 Are you ready?💥
RDX, streaming from tomorrow on Netflix. #RDXonNetflix pic.twitter.com/nz51d2EMg1
— Netflix India South (@Netflix_INSouth) September 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.