IND vs AUS 1st ODI: అదరగొట్టిన గిల్‌, రుతురాజ్‌.. ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్‌ ప్లేయర్లు లేకపోయినా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆసీస్‌ను మహ్మద్ షమీ దెబ్బతీశాడు.

IND vs AUS 1st ODI: అదరగొట్టిన గిల్‌,  రుతురాజ్‌.. ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం
India Vs Australia
Follow us
Basha Shek

|

Updated on: Sep 22, 2023 | 10:09 PM

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్‌ ప్లేయర్లు లేకపోయినా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆసీస్‌ను మహ్మద్ షమీ దెబ్బతీశాడు. తన కెరీర్‌లో అత్యుత్తమంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను 276 పరుగులకు ఆలౌట్ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో శుభ్‌మన్‌ గిల్‌ (74) మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనితో పాటు మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(71), స్టాండింగ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (58 నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (50) సమష్ఠిగా రాణించడంతో 49 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది భారత్. ఈ విజయంలో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అలాగే వన్డే ఫార్మాట్‌లో టీమిండియా కూడా నంబర్ 1 ర్యాంక్‌కు చేరుకుంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టే అగ్రస్థానంలో ఉండడం విశేషం. కాగా 2023 ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఆస్ట్రేలియా కూడా కీలక ఆటగాళ్లు లేకుండానే మొహాలీ వన్డేలో బరిలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అయ్యింది. కాగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 27 ఏళ్ల తర్వాత భారత్ విజయం సాధించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ మొదట బౌలింగ్ తీసుకుంది. 4 ప‌రుగుల వద్దే  మిచెల్ మార్ష్‌(4) వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం ఇచ్చాడు షమీ.  ఆ త‌ర్వాత వ‌చ్చిన స్మిత్(41), మరో ఓపెనర్‌ వార్నర్‌(52) దూకుడుగా ఆడారు.  రెండో వికెట్‌కు 94 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. జడేజా స్మిత్‌ను ఔట్‌ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే ల‌బూషేన్(39), గ్రీన్‌ (30) ఆసీస్ ను  ఆదుకున్నారు. ఆఖర్లో గ్రీన్‌ కూడా ధాటిగా ఆడి ఆసీస్‌ స్కోర్‌ను 250 దాటించారు.

అర్ధసెంచరీతో రాణించిన సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్

ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్:

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషెన్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లీస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా

భారత జట్టు: శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!