- Telugu News Photo Gallery Cricket photos IND Vs AUS: Mohammed Shami picks his 2nd 5 wicket haul to register his best ODI figures
IND vs AUS 1st ODI: 5 వికెట్లతో ఆసీస్‌ను కంగారెత్తించిన షమీ.. దెబ్బకు 16 ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి మెరిశాడు. వన్డేల్లో షమీకి ఇదే అత్యుత్తమ బౌలింగ్ కావడం విశేషం.ఈ మ్యాచ్‌లో మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన షమీ, తొలి ఓవర్ నాలుగో బంతికి 4 బంతుల్లో కేవలం 4 పరుగుల వద్ద మిచెల్ మార్ష్‌ను అవుట్ చేశాడు.
Basha Shek | Edited By: Ravi Kiran
Updated on: Sep 23, 2023 | 10:15 AM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి మెరిశాడు. వన్డేల్లో షమీకి ఇదే అత్యుత్తమ బౌలింగ్ కావడం విశేషం.ఈ మ్యాచ్‌లో మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన షమీ, తొలి ఓవర్ నాలుగో బంతికి 4 బంతుల్లో కేవలం 4 పరుగుల వద్ద మిచెల్ మార్ష్‌ను అవుట్ చేశాడు.

అయితే ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41) రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో చెలరేగిన వార్నర్ ను జడేజా ఔట్ చేయగా.. భారీ స్కోరుపై కన్నేసిన స్టీవ్ స్మిత్ వికెట్‌ను షమీ బోల్తా కొట్టించడంలో సఫలమయ్యాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్‌ల వికెట్లు తీసి ఐదు వికెట్ల హాల్‌ను పూర్తి చేశాడు.

కాగా ఈ అద్భుత ప్రదర్శనతో 16 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఆసీస్‌లో వన్డే సిరీస్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేసర్‌గా షమీ నిలిచాడు. 2007లో గోవాలో చివరిగా భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ఐదు వికెట్లు తీశాడు. ఇక స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేసర్ కూడా షమీనే కావడం గమనార్హం.

అజిత్ అగార్కర్, కపిల్ దేవ్‌లతో పాటు ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన మూడో భారత పేసర్‌గా షమీ నిలిచాడు. ఇక్కడ తేడా ఏమిటంటే, షమీ ఈ ఫీట్‌ను భారత్‌లో సాధిస్తే, అగార్కర్, కపిల్ ఇద్దరూ విదేశాల్లో ఈ రికార్డు నెలకొల్పారు.

1983లో నాటింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 43 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. అలాగే 2004లో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో పేసర్ అజిత్ అగార్కర్ 42 పరుగులిచ్చి ఆసీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజాగా మొహాలీలో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ 51 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.





























