Jabardasth: హీరోగా మారిన మరో జబర్దస్త్‌ కమెడియన్‌.. ప్రీ వెడ్డింగ్‌ ప్రసాద్‌గా ముక్కు అవినాష్‌

Mukku Avinash: వేణు బలగం సినిమాతో డైరెక్టర్‌గా హిట్‌ కొడితే.. సుడిగాలి సుధీర్‌ ఇప్పటికే నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక గెటప్‌ శీను హీరోగా నటిస్తూనే, పలు సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేయనున్నాడు. వీరితో పాటు ఆటో రామ్‌ ప్రసాద్‌, చమ్మక్‌ చంద్ర, రాకెట్‌ రాఘవ వంటి కమెడియన్లు అడపాదడాపా సినిమాల్లో కనిపిస్తున్నారు.

Jabardasth: హీరోగా మారిన మరో జబర్దస్త్‌ కమెడియన్‌.. ప్రీ వెడ్డింగ్‌ ప్రసాద్‌గా ముక్కు అవినాష్‌
Mukku Avinash
Follow us
Basha Shek

|

Updated on: Sep 23, 2023 | 3:59 PM

జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్లుగా తమ ట్యాలెంట్‌ను నిరూపించుకున్నారు. ఈ కామెడీ షోతో పాపులర్‌ అయిన నటీనటులు క్రమంగా సినిమాల్లోకి కూడా అడుగుపెడుతున్నారు. డైరెక్టర్లుగా, హీరోలుగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. వేణు బలగం సినిమాతో డైరెక్టర్‌గా హిట్‌ కొడితే.. సుడిగాలి సుధీర్‌ ఇప్పటికే నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక గెటప్‌ శీను హీరోగా నటిస్తూనే, పలు సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేయనున్నాడు. వీరితో పాటు ఆటో రామ్‌ ప్రసాద్‌, చమ్మక్‌ చంద్ర, రాకెట్‌ రాఘవ వంటి కమెడియన్లు అడపాదడాపా సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇక మరో జబర్దస్త్‌ కమెడియన్‌ శాంతి కుమార్‌ కూడా నాతో నేను అనే మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పుడీ జాబితాలోకి మరో జబర్దస్త్ నటుడు చేరారు. అతను మరెవరో కాదు ముక్కు అవినాష్. జబర్దస్త్‌ కామెడీషోలో తన దైన హాస్యంతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ నటుడు ఇప్పుడు హీరోగా తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ప్రీ వెడ్దింగ్ ప్రసాద్‌ అనే డిఫరెంట్ సినిమాలో అవినాష్‌ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది. ఇందులో పాతకాలం హీరో గెటప్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడీ స్టార్‌ కమెడియన్‌. ఇందులో సాయి కుమార్‌, సంగీత, రియాజ్‌, రూప తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌, ఇతర టెక్నీషియన్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‌ సినిమాకు ప్రముఖ రచయిత రాకేష్‌ దుబాసి దర్శకత్వం వహిస్తున్నారు. డెక్కన్‌ డ్రీమ్‌ వర్క్‌ బ్యానర్‌పై అభిషేక్‌ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినమాను నిర్మించనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ వెడ్డింగ్ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ కోదండ రామిరెడ్డి క్లాప్‌ ఇచ్చి అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ స్వరాలు అందించనున్నారు. శ్యామ్ కే నాయుడు కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్‌ చెబుతున్నారు. కాగా హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై ముక్క అవినాష్‌ ఎమోషనల్ అయ్యాడు. తనను నమ్మి సినిమా చేస్తున్న నిర్మాత అభిషేక్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు అవినాష్‌.

ఇవి కూడా చదవండి

ప్రీ వెడ్డింగ్‌ ప్రసాద్‌లో అవినాష్ ఫస్ట్ లుక్..

ప్రీ వెడ్డింగ్‌ ప్రసాద్‌ పోస్టర్ రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో