AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Bhavani Shankar: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. అమ్మకు క్యాన్సర్ అంటూ తల్లడిల్లిన ప్రియా భవానీ శంకర్..

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో ప్రియా భవానీ శంకర్ ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత యాంకర్ గా మారింది. బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేసిన ప్రియా .. ఆ తర్వాత కథానాయికగా మారింది. కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ ప్రస్తుతం పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది ప్రియా. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 22న ప్రపంచ […]

Priya Bhavani Shankar: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. అమ్మకు క్యాన్సర్ అంటూ తల్లడిల్లిన ప్రియా భవానీ శంకర్..
Priya Bhavani Shankar
Rajitha Chanti
|

Updated on: Sep 23, 2023 | 3:38 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో ప్రియా భవానీ శంకర్ ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత యాంకర్ గా మారింది. బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేసిన ప్రియా .. ఆ తర్వాత కథానాయికగా మారింది. కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ ప్రస్తుతం పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ఇటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది ప్రియా. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇటీవల ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి క్యాన్సర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రియా అతిథిగా పాల్గొంది. ఈవెంట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి స్ఫూర్తినిచ్చేందుకు నిర్వహించారు. అయితే ఈ వేడుకలో ప్రియా మాట్లాడుతూ తన తల్లి క్యాన్సర్ తో పోరాడుతుందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

ప్రియా మాట్లాడుతూ… “మా అమ్మకు క్యాన్సర్ ఉంది. గతేడాది తనకు క్యాన్సర్ ఉందని తెలిసింది. అప్పుడు నన్ను కూడా టెస్ట్ చేయింకోవాలని వైద్యులు చెప్పారు. అమ్మ అనారోగ్యానికి గురయినప్పుడల్లా నీకు త్వరగా నయమవుతుందని ధైర్యం చెబుతుంటాను. దీనిని మేము ముందుగానే గుర్తించాము అందుకే అమ్మకు త్వరగా చికిత్స చేయించగల్గుతున్నాము. ఈరోజు చాలా మంది ఇక్కడికి వచ్చి తమ అనుభవాలను మాతో పంచుకోవడం నిజంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంది.క్యాన్సర్ కు మా అమ్మ బలికానివ్వను. వైద్యులపై పూర్తి నమ్మకముంది” అంటూ చెప్పుకొచ్చింది ప్రియా భవానీ శంకర్.

ప్రియా భవానీ శంకర్ చివరిగా బొమ్మై చిత్రంలో కనిపించారు. ఇందులో ఎస్ జె సూర్య నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రస్తుతం ఆమె డిమాంటే కాలనీ 2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ప్రపంచ రోజ్ డే ఎందుకు నిర్వహిస్తారంటే.. క్యాన్సర్ మహామ్మరి బారిన పడిన రోగులు మనోధైర్యంతో ఉండాలనే సందేశాన్ని చాటి చెప్తూ సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరపుకుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.