Vijay Antony: ‘మీరు గ్రేట్ సార్’.. దుఃఖంలోనూ గొప్ప మనసు చాటుకున్న విజయ్ ఆంటోని.. సినిమా రిలీజును ఆపోద్దంటూ..
కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె హఠాన్మరణం విజయ్ కుటుంబాన్ని బాగా కుంగదీసిందని చెప్పవచ్చు. ఈ విషాదం నుంచి ఇప్పట్లో ఆఫ్యామిలీ కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ తన గొప్ప మనసును చాటుకున్నాడు విజయ్ ఆంటోని. తన లేటెస్ట్ సినిమా 'రత్తం' రిలీజ్
తమిళ స్టార్ హీరో అండ్ ట్యాలెంటెండ్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోని ( 16) ఆత్మహత్య అందరినీ షాక్‌కు గురిచేసింది. సెప్టెంబర్ 19న చెన్నైలోని తన నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. డిప్రెషన్‌తోనే మీరా సూసైడ్ చేసుకున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు పోస్ట్‌మార్టం లోనూ ఇదే రిపోర్టు వచ్చింది. కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె హఠాన్మరణం విజయ్ కుటుంబాన్ని బాగా కుంగదీసిందని చెప్పవచ్చు. ఈ విషాదం నుంచి ఇప్పట్లో ఆఫ్యామిలీ కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ తన గొప్ప మనసును చాటుకున్నాడు విజయ్ ఆంటోని. తన లేటెస్ట్ సినిమా ‘రత్తం’ రిలీజ్‌ను ఆపొద్దని దర్శకనిర్మాతలకు చెప్పారట. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా పలు సార్లు వాయిదా పడింది. మరొకసారి రిలీజ్ ఆపితే నిర్మాత ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతుంది. అందుకే ముందుగా అనుకున్న సమయానికే రత్తం సినిమా అక్టోబర్ 6న తమిళ్‌లో రిలీజ్ చేయానున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్‌పై ఇంకా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కాగా రత్తం సినిమా ప్రమోషన్లు చాలా రోజుల క్రితమే మొదలయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పాటు థియేటర్లను కూడా ముందుగానే బుక్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వాయిదా పడితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని విజయ్ ఆంటోని భావించారు. అందుకే ముందు అనుకున్న డేట్‌కే రత్తం సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
విజయ్ ఆంటోని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కూతురును కోల్పోయిన బాధలోనూ నిర్మాత మంచి గురించే విజయ్ ఆలోచించారంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రత్తం సినిమాకు సీఎస్ ఆముధన్ దర్శకత్వం వహించారు. పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా విజయ్ ఆంటోని కనిపించనున్నారు. ప్రముఖ తెలుగు హీరోయిన్ నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్ర పోషించింది. వీరితో పాటు మహిమా నంబియార్, రమ్య నంబిసన్, ఉదయ్ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. చెన్నైలో సృష్టించిన వరుస హత్యల నేపథ్య కథాంశంతో రత్తం తెరకెక్కింది. రత్తంతో కలిపి సుమారు అరడజను సినిమాలు విజయ్ ఆంటోని చేతిలో ఉండడం గమనార్హం. అగ్ని సిరుగాల్, వాలిమాయ్, లవ్‌గురు వంటి క్రేజీ ప్రాజెక్టులో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
రత్తం సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.