AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Squid Game Season 2: ‘స్క్విడ్ గేమ్’ మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది.. రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

స్క్విడ్ గేమ్.. సుమారు రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‍ వరల్డ్ మోస్ట్ పాపులర్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠ గొలిపే ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీ ఆడియెన్స్‌కు మంచి థ్రిల్‌ ఇచ్చింది. ఈ సిరీస్‌ అచ్చం మన బిగ్‌బాస్‌షోను పోలి ఉంటుంది. అయితే వయెలెన్స్‌ మాత్రం వేరె లెవెల్‌లో ఉంటుంది. ఎంతవరకు అంటే గేమ్స్‌లో, టాస్క్‌లో ఓడిన కంటెస్టెంట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే.

Squid Game Season 2: 'స్క్విడ్ గేమ్' మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది.. రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Squid Game Season 2
Basha Shek
|

Updated on: Sep 23, 2023 | 8:03 PM

Share

స్క్విడ్ గేమ్.. సుమారు రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‍ వరల్డ్ మోస్ట్ పాపులర్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠ గొలిపే ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీ ఆడియెన్స్‌కు మంచి థ్రిల్‌ ఇచ్చింది. ఈ సిరీస్‌ అచ్చం మన బిగ్‌బాస్‌షోను పోలి ఉంటుంది. అయితే వయెలెన్స్‌ మాత్రం వేరె లెవెల్‌లో ఉంటుంది. ఎంతవరకు అంటే గేమ్స్‌లో, టాస్క్‌లో ఓడిన కంటెస్టెంట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. చిన్నచిన్న గేమ్‍లతోనే ఉండే ఈ స్క్విడ్ గేమ్‍లలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్లు చేసే పోరాటాన్ని ఎంతో హృద్యంగా ఈ వెబ్ సిరీస్‌లో చూపించారు మేకర్స్‌. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కు వచ్చిన స్క్విడ్ గేమ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రికార్డులన్నీ బద్దలయ్యాయి. రిలీజైన కేవలం 28 రోజుల్లోనే ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది చూశారంటే ఈ సిరీస్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో చెప్పవచ్చు. అలాగే 28 రోజుల్లోనే 1.65 బిలియన్ గంటల వ్యూయర్ షిప్‌ సొంతం చేసుకుంది. ఇక అంతర్జాతీయంగా పలు అవార్డులను కూడా స్క్విడ్ గేమ్ గెల్చుకుంది. ప్రతిష్టాత్మక ఎమ్మీ పురస్కారాల్లో 14 విభాగాల్లో నామినేట్‌ అయిన స్క్విడ్ గేమ్ ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న స్క్విడ్ గేమ్‌కు సెకండ్ సీజన్‌ కూడా వస్తోంది. మొదటి పార్ట్‌లోనే సీక్వెల్‌ ఉంటుందని హింట్‌ఇచ్చారు మేకర్స్‌. దీనికి తగ్గట్టుగానే త్వరలోనే స్క్విడ్ గేమ్ సెకెండ్‌ పార్ట్‌ స్ట్రీమింగ్ కు రానుంది. దీనికి సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఇందులో భాగంగా స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ అనే పేరుతో రానున్న ఈ సెకండ్ సీజన్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే నవంబర్‌ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుందని అధికారికంగా ప్రకటించారు.

ఇది వరల్డ్‌ బిగ్గెస్ట్ కాంపిటీషన్ సిరీస్

స్క్విడ్ గేమ్ మొదటి పార్ట్‌కు మించి రెండో సీజన్‌ను తెరకెక్కించినట్లు టీజర్‌ చూస్తేనే తెలుస్తోంది. 4.56 మిలియన్ల డాలర్ల ప్రైజ్ మనీ కోసం 456 మంది పోటీపడనున్నట్లు ఈ టీజర్‌లో చూపించారు. ‘ ఇది వరల్డ్‌ బిగ్గెస్ట్ కాంపిటీషన్ సిరీస్’. భారీ క్యాష్‌ ప్రైజ్‌ కోసం తలపడండి’ అని కంటెస్టెంట్లకు చెబుతూ వాయిస్‌ ఓవర్‌ ఉంది. స్క్విడ్ గేమ్‍ వెబ్‌ సిరీస్‌కు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ తెరకెక్కించారు. మొదటి పార్ట్‌లో కనిపించిన లీ జంగ్ జే, లీ బ్యుంగ్ హున్, వి హా జున్, గాంగ్ యూ… రెండో సీజన్‌లో కూడా నటించనున్నారు. వీరితో మరికొంతమంది నటీనటులు రెండో సీజన్‌లో భాగం కానున్నారు. త్వరలోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

స్క్విడ్ గేమ్ సెకెండ్ సీజన్ టీజర్‌

View this post on Instagram

A post shared by Netflix US (@netflix)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..