AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్‌లో సంచలన ఓటింగ్.. దూసుకెళ్తున్న గౌతమ్.. ఆమె ఔట్!

శుభ శ్రీ థర్డ్ ప్లేసులో నిలిచింది. ఇటీవల నామినేషన్స్‌లో ఆమె మాట్లాడిన పాయింట్స్‌ వీక్షకులకు భలే నచ్చాయి. స్వతహాగా లాయర్ అవ్వడంతో.. తన పాయింట్స్ చాలా వివరణాత్మకంగా చెప్పింది. ఇక అమరదీప్‌ చెప్పిన సిల్లీ పాయింట్‌కు ఆమెను నామినేట్ చేయడంతో.. ఆడియెన్స్ సానుభూతితో ఓట్లు వేస్తున్నారు. ఇక నాలుగవ ప్లేసులో ప్రియాంక ఉంది. ఈమె ఓటింగ్ బీభత్సంగా తగ్గినట్లు స్పష్టమవుతుంది.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్‌లో సంచలన ఓటింగ్.. దూసుకెళ్తున్న గౌతమ్.. ఆమె ఔట్!
Gowtham Vs Sivaji
Ram Naramaneni
|

Updated on: Sep 27, 2023 | 6:29 PM

Share

బిగ్ బాస్ గేమ్ షో సీజన్ 7 ఉల్టా పుల్టా ట్విస్టులతో దూసుకుపోతుంది. ఎప్పుడు లేని ట్విస్టులతో హొరెత్తిస్తున్నాడు బిగ్ బాస్. దీంతో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. వీక్షకుల మైండ్ సెట్స్ కూడా ఒక్క రోజులోనే మారిపోతున్నాయి. ఈ వారం యావర్, గౌతమ్, ప్రియాంక, టేస్టీ తేజ, రతిక, శుభ శ్రీ నామినేషన్‌లో ఉన్నారు. అయితే అనధికార పోలింగ్ ఫలితాల్లో మైండ్ బ్లోయింగ్ రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుతానికి పలు పోల్స్‌లో ప్రిన్స్ యావర్ టాప్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాత ప్లేసులోకి అనూహ్యంగా గౌతమ్ దూసుకువచ్చాడు. గౌతమ్.. యావర్ గురించి తన వెర్షన్ బలంగా వినిపించినప్పటికీ.. నామినేషన్ జ్యూరీ సిల్లీ అని పేర్కొనడం.. శివాజీ న్యాయనిర్ణేతగా కాకుండా లాయర్ మాదిరిగా వకాల్తా పుచ్చుకోని మాట్లాడటం.. ఇంతవరకు ఎవరూ చేయనట్లుగా శివాజీతో కయ్యానికి కాలు దువ్వడం వంటివి గౌతమ్‌కి ప్లస్ అయ్యాయి. అతడు వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడాడని నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తుంది. సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ అయిన అతడికి అన్యాయం జరిగిందని భావించే వారి సంఖ్య పెరిగింది. దీంతో అతడికి ఓట్లు గుద్దేస్తున్నారు.

శుభ శ్రీ పాయింట్స్‌కు జనం ఫిదా

ఇక శుభ శ్రీ థర్డ్ ప్లేసులో నిలిచింది. ఇటీవల నామినేషన్స్‌లో ఆమె మాట్లాడిన పాయింట్స్‌ వీక్షకులకు భలే నచ్చాయి. స్వతహాగా లాయర్ అవ్వడంతో.. తన పాయింట్స్ చాలా వివరణాత్మకంగా చెప్పింది. ఇక అమరదీప్‌ చెప్పిన సిల్లీ పాయింట్‌కు ఆమెను నామినేట్ చేయడంతో.. ఆడియెన్స్ సానుభూతితో ఓట్లు వేస్తున్నారు. ఇక నాలుగవ ప్లేసులో ప్రియాంక ఉంది. ఈమె ఓటింగ్ బీభత్సంగా తగ్గినట్లు స్పష్టమవుతుంది. ఆమె సీరియల్ గ్రూపుకు చెందిన అమర్‌దీప్, శోభా నామినేషన్స్‌లో ఉన్నప్పటికీ.. ప్రియాంకకు ఓట్లు తగ్గడం గమనార్హం. ఆమె ఇటీవల పలుమార్లు ప్లేట్లు ఫిరాయించడం, అమర్‌దీప్ విషయంలో సేఫ్ గేమ్ ఆడటాన్ని వ్యూయర్స్ కాస్త సీరియస్‌గా తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఇక 5వ స్థానంలో టేస్టీ తేజా ఉన్నాడు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో తేజ తన ఆటతీరు మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతే కొనసాగితే అతడికి ఓట్లు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

రతికా రోజ్ ఔట్..!

ఇక మహానటి, నిత్యం ప్లేట్లు ఫిరాయించే రతికా రోజ్ చివరి స్థానంలో ఉంది. ఈవిడ గారి బయటకు పంపించాలని వీక్షకులు గట్టిగా ఫిక్సయ్యారు. సోషల్ మీడియా అంతా ఆమెను ఎలిమినేట్ చేయాలని కామెంట్లు కనిపిస్తున్నాడు. పదే, పదే పక్కన ఉన్నవారికి వెన్నుపోటు పొడవడం.. కంటెంట్ కోసం.. పిచ్చి వేశాలు వేయడం.. ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం.. తనే అంతా చేసి.. ఇతరులపైకి వేలెత్తి చూపడం వంటి నస పనులతో ఆమె ఆడియెన్స్‌కు చిరాకు తెప్పిస్తుంది. గ్లామర్ కావాలి అని బిగ్ బాస్ వాళ్లు ఆలోచిస్తే తప్ప.. ఆమె బయటకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..