Bigg Boss Season 7: యాడ దొరికిన సంత రా.. ఇది బీబీ హౌసా.. లేక పిచ్చాసుపత్రా..

ఇక ఈ హంగర్ టాపిక్ నుంచి.. నేరుగా.. బిగ్ బాస్ సీజన్‌ 7 హైలెట్స్‌లోకి వెళితే..! 26th ఎపిసోడ్ మొదలవడమే .. లైగర్ సినిమాలోని దిమ్మతిరిగే డ్యాన్స్ బీట్‌ తో మొదలవుతుంది. కంటెస్టెంట్స్‌ లేజీగా నిద్రలేవడాల మధ్యలో.. అలా లేచిన వాళ్లు.. వారిలోని డ్యాన్స్ కళను.. బయటపెట్టే ప్రయత్నంతో.. అలా.. అలా సాగుతుంది. ఇక ఇక్కడ కట్ చేస్తే.. నేరుగా కిచన్‌లో ముందే చెప్పిన.. పంచాయితీ తాలూకు కథ షూరూ అవుతుంది.

Bigg Boss Season 7: యాడ దొరికిన సంత రా.. ఇది బీబీ హౌసా.. లేక పిచ్చాసుపత్రా..
Bigg boss Season 7 Highlights
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 29, 2023 | 1:16 AM

మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీస్‌లో .. ఆకలి కోసం కొట్టుకుంటారని తెలుసు.. అయితే వాళ్లు ఎలా కొట్టుకుంటారో అన్నది మాత్రం పని గట్టుకుని ఎప్పుడూ చూసి ఉండరు. కానీ ఈ రోజు అంటే 25thడే.. 26th ఎపిసోడ్‌లో మాత్రం.. అలాంటి సీన్‌నే రీ క్రియేట్ చేశారు మన బీబీ7 కంటెస్టెంట్స్. ప్రిన్స్ యావర్‌ ఒక్కడే.. ఎక్కువ చపాతీలు తిన్నాడని.. ఆమ్లెట్స్ కూడా లాగించాడని.. ఈ కండల వీరుడిపై చిన్న పాటి యుద్ధమే చేశారు స్టార్ మా గ్రూప్ వారు. ఇక మధ్యలో పెద్ద హోదాలో వచ్చిన శివాజీకి.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ‘ఇదెక్కడి పంచాయితీరా దేవుడా 🤕🙏’.. అనే కామెంట్ సగటు బీబీ ఫ్యాన్ నుంచి వచ్చేలా చేసుకున్నారు.

ఇక ఈ హంగర్ టాపిక్ నుంచి.. నేరుగా.. బిగ్ బాస్ సీజన్‌ 7 హైలెట్స్‌లోకి వెళితే..! 26th ఎపిసోడ్ మొదలవడమే .. లైగర్ సినిమాలోని దిమ్మతిరిగే డ్యాన్స్ బీట్‌ తో మొదలవుతుంది. కంటెస్టెంట్స్‌ లేజీగా నిద్రలేవడాల మధ్యలో.. అలా లేచిన వాళ్లు.. వారిలోని డ్యాన్స్ కళను.. బయటపెట్టే ప్రయత్నంతో.. అలా.. అలా సాగుతుంది. ఇక ఇక్కడ కట్ చేస్తే.. నేరుగా కిచన్‌లో ముందే చెప్పిన.. పంచాయితీ తాలూకు కథ షూరూ అవుతుంది.

స్టార్ మా బ్యాచ్ అంటే.. శోభ, ప్రియాంక, అమర్ దీప్, సందీప్.. వీళ్లతో పాటు.. సుబ్బు.. తేజు..ఆపక్కనే ఈ పంచాయితీ ఎపిసోడ్‌లో చాలా సైలెంట్‌గా ఉన్న రతిక.. వీళ్లందరూ చపాతీలు చేస్తూ.. కాలుస్తూ.. తింటూ ఉంటారు. ఇక మరో పక్క గార్డెన్ ఏరియాలో … బజర్ పక్కనే కూర్చుని.. రైతు బిడ్డ ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఫుడ్‌ను షేర్ చేసుకుంటూ తింటూ ఉంటారు. ఇక ఈక్రమంలోనే ఆట సందీప్.. ప్రిన్స్ యావర్ తీరును విమర్శిస్తూ.. అగ్గి రాజేస్తాడు. ప్రశాంత్‌కు ఒంట్లో బాలేకపోయినా.. వాడితో ఫుడ్‌ తెప్పించుకుని మరీ ప్రిన్స్ తింటున్నాడని.. అసలు ప్రిన్స్ బజర్ పక్కనే కూర్చుంటే..ఇక్కడ పని చేసే మిగతా కంటెస్టెంట్స్ పని చేయడానికే వచ్చారా అని .. ఓ రెండు పాయింట్లు లేవనెత్తుతాడు.

ఇక దీన్ని అందుకున్న శోభ, ప్రియాంక, అమర్ దీప్ కూడా అవును అన్నట్టే.. సందీప్‌కు వంత పాడుతుంటారు. ప్రశాంత్ ఫుడ్‌ కూడా ప్రిన్స్ తింటున్నాడని.. ఇప్పటికే చాలా తిన్నాడని కోరస్ ఇస్తుంటారు. ఇక ఈమక్రంలోనే.. శివాజీకి.. మరో చపాతీ కావాలి తీసుకుకురా అన్న అంటూ.. ప్రిన్స్ యావర్‌ రెక్వెస్ట్ చేస్తాడు. ఎన్ని తిన్నావ్‌రా అని శివాజీ అడిగితే.. 5 తిన్నా ఇంకోటి కావాలన్నా అంటాడు. దీంతో శివాజీ వాళ్ల దగ్గరి వెళ్లి అడిగి తీసుకుంటాడు. కానీ సందీప్ చెప్పిన పాయింట్‌ను నోట్ చేసుకుని.. ప్రిన్స్కు చెబుతాడు. ఇది సరికాదు.. వాళ్ల ఇలా చపాతీలు తెప్పించుకుని ఎక్కువ తినడాన్ని ఎత్తి చూపుతున్నారు. ఫీల్ అవుతున్నారు అలా చేయకురా అని ప్రిన్స్‌కు చెబుతాడు.

ఇక దీంతో కిచెన్‌ దగ్గరికి వచ్చిన ప్రిన్స్.. అప్పటికే అరుస్తున్న సందీప్‌తో వాదనకు దిగుతాడు. అది తన గేమ్ ప్లాన్ అని ప్రిన్స్ వాదిస్తుండగా.. సెల్ఫిష్ బిహేవియర్ అంటూ.. సందీప్ కామెంట్ చేస్తుంటాడు. ఇక ఈ క్రమంలోనే కాస్త హైకి వెళ్లిన యావర్ ప్రిన్స్ ప్లేట్‌ను.. తినే చపాతీని కాస్త రాష్‌గా టేబుల్‌ పై పెట్టేస్తాడు. దీంతో మరింత ఆవేశానికిలోనైన సందీప్.. ఫుడ్ వేస్ట్ చేయొద్దని.. ప్లేట్ అక్కడి నుంచి తీయమని ప్రిన్స్‌ పై అరుస్తుంటాడు.

ఇక వీళ్ల లొల్లి చూడలేక.. వీళ్ల పంచాయితీ సెట్ చేద్దామని.. శివాజీ వీళ్ల మధ్యలోకి వస్తాడు. పెద్ద మనిషిలాగే మాట్లాడి.. చపాతీ అడిగాడు.. వీళైతే ఇద్దం.. లేదా వద్దు అంటాడు. అయితే సందీప్, శోభ, ప్రియాంక ఎక్కడా తగ్గకపోవడంతో.. శివాజీ మళ్లీ మధ్యలోకి వస్తాడు. చిన్న చిన్న విషయాలుకు ఏంటిది అని.. అందర్నీ వారిస్తుంటాడు. జనాలు చూస్తున్నారు. పట్టి లాగొద్దు విదిలేయండి అని అంటాడు

అంతే.. ‘శివాజీ నోటి నుంచి వచ్చిన జనాలు చూస్తున్నారు’ అన్న మాటకు ట్రిగ్గర్ అయిన శోభ.. శివాజీతో గొడవకు దిగుతుంది. ‘ఎప్పుడూ జనాలు చూస్తున్నారు అని చెప్పడం ఏంటి..? నాకు తెలుసు ఐయామ్ 28 ఇయర్ గర్ల్‌. నాకు ఎప్పుడూ ఇదే చెబుతారు’ అంటూ శివాజీ మీదికి ఎగిరి దూకినంత పని చేస్తుంది శోభ. తన మాటలతో శివాజీని అక్కడి నుంచి చేసేదేంలేక వెళ్లేలా చేస్తుంది. అయితే అలా వెళుతూనే.. ‘నాగార్జున గారు పెద్ద మనిషిగా సలహాలు ఇవ్వమన్నారు కాబట్టే ఇస్తున్నా..’ ఇంకో సారి ఇవ్వను అని చెబుతూ వెళతాడు.

ఇక మరో పక్క సిగరెట్ లాంజ్‌ లో కూర్చుని.. స్టార్ మా బ్యాచ్‌ అందులో రతిక, సందీప్ శివాజీ తీరును విమర్శిస్తారు. ప్రిన్స్, ప్రశాంత్‌నే శివాజీ సపోర్ట్ చేస్తాడు. వాళ్ల ఏం చేసినా సమర్ధిస్తాడు అంటూ.. కామెంట్ చేస్తుంటారు. ఇక మరో పక్క శివాజీ ‘అమ్మా.. అమ్మా.. బోలేతో. కోయి నయి సున్తా.. దికాయేంగే ఆజ్‌ సే’ అంటూ.. ప్రిన్స్ తో .. స్టార్ మా బ్యాచ్ చేస్తున్న లొల్లి గురించి మాట్లాడుకుంటారు. ఒకరిని అంటే.. నలుగురు మీదపడుతున్నారు.. అంటూ వాళ్ల పై కాస్త అసహం వ్యక్తం చేస్తాడు. అంతేకాదు ‘రేపటి నుంచి నాది నేను తింటా..’ అంటూ ఫిక్సై పోతాడు.

ఈ లొల్లి తర్వాత మొదలైన బీబీ కాయిన్ గేమ్లో మరో సారి బజర్ మోగగా.. ఫాస్ట్ గా వెళ్లి దాన్ని ఒడిసిపట్టుకుంటాడు ప్రిన్స్. ఆ తర్వాత సుబ్బుతో మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ముందు స్టార్ మా టీంను గేమ్‌ నుంచి సైడ్‌ చేయాలని సుబ్బు అండ్ ప్రశాంత్‌తో డిస్కషన్ పెడతాడు.

ఇక తర్వాత లైన్లోకి వచ్చిన బిగ్ బాస్.. ఎక్కువ కాయిన్స్ గెలుచున్న కారణంగా.. ప్రిన్స్ యావర్‌కు ఓ టాస్క్‌ ఇస్తాడు. ఓ షార్ట్ గ్లాస్‌ నిండా.. కన్నీటి చుక్కలు నింపాలని.. అందుకోసం ఒక పార్టనర్.. ఇద్దరు ఆపోనెంట్స్ను ఎన్నుకోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇక ఈ టాస్క్లో ప్రశాంత్‌ను పార్టనర్‌గా చేసుకున్న ప్రశాంత్.. అమర్, గౌతమ్‌ను అపోనెంట్‌గా ఎన్నుకుని .. వాళ్ల మీద గెలుస్తారు. ఎంచుకున్న ఇద్దురు ఆపోనెంట్స్ దగ్గరి నుంచి కాయిన్స్‌ గెలుచుని.. ప్రశాంత్, యావర్‌ చెరి సమానంగా పంచుకుంటారు. ఇక ఈ క్రమంలోనే సుబ్బు, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శివాజీ ఒక టీంగా ఫాం అవుతారు.

ఇక అందరి కంటే ఎక్కువ కాయిన్స్ పొందిన కారణంగా.. ప్రిన్స్ యావర్, ప్రశాంత్ నాలుగవ పవరాస్త్ర కోసం కంటెండర్స్‌గా ఎన్నికైనట్టు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. దీంతో అమర్ దీప్ ఏడుస్తుంటాడు. కట్ చేస్తే తినడం.. బోళ్లు కడగడమే పని అంటూ.. తేజ ఫన్నీగా బాధపడుతుంటాడు. ఇంకో పక్క ప్రశాంత్.. సుబ్బుతో కలిసి.. నాగ్ ఇచ్చిన మిరప మొక్కకు పూజ చేస్తుంటాడు. ఏమాటకామాట.. ఎందుకో పూజ దగ్గర కాస్త ఓవర్ చేసినట్టు.. ఫేక్ గా కూడా అనిపిస్తాడు.

ఆ తరువాత మళ్లీ.. తన క్రియేటివ్ టాస్క్‌తో.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తాడు. ఈసారి హౌస్‌లో గానా టాస్క్‌ జరగనుందని.. అందుకోసం కంటెస్టెంట్స్ అందరూ.. డిఫరెంట్‌గా రెడీ అవ్వాలని..టాక్‌ ఆఫ్ ది టాప్‌ అవ్వాలి వాళ్ల వాళ్ల గెటప్స్‌ అంటూ.. అనౌన్స్ చేస్తాడు.దీంతో ఒక్కొక్కరూ కర్ణ కఠోరంగా రెడీ అవుతారు. తేజు కూరగాయలతో రెడీ అవగా.. రతిక పొట్టతో.. గౌతమ్‌ సూపర మ్యాన్ సూట్‌తో రెడీ అవుతాడు. ఇక అందులో ప్రియాంక అతి భయకరంగా బీబీ హోస్ట్ గా.. అమర్‌ హాఫ్ గడ్డం తీసుకుని ఎటూ ఆనని ఇంటర్నేషనల్ మోడల్‌లా రెడీ అవుతారు. ప్రశాంత్ ప్లాస్టిక్ కవర్స్‌ కట్టుని..విచిత్రంగా రెడీ అవగా.. యావర్ ముసలాడిగా.. ట్రాన్స్ ఫాం అవుతాడు.

ఇలా చిత్ర విచిత్రంగా రెడీ అయిన వీళ్లందరూ.. యాక్టివిటీ రూంలోకి వెళ్లి చేరతారు. యాడ సంత రా ఇదంతా.. ఇది బిబీ హౌసా లేక పిచ్చాసుపత్రా అనే ఫీల్ అందరికీ కలిగేలా చేస్తారు. ఇక సందీప్‌, శోభ యాంకర్ చేస్తుండగా.. ఒక్కొక్కరూ వాళ్ల వాళ్ల వెరైటీ గెటప్స్‌తో ర్యాంప్ వాక్ చేస్తారు. అయితే ఇందులో బీబీ దెయ్యంగా.. అదరగొబుతుంది ప్రయాంక. ఇక అంతలోనే ఈ ఎపిసోడ్‌ కూడా ఎండ్‌ అయి.. ‘రేపటి ఎపిసోడ్‌ కూడా ఈ గానా టాస్క్‌నే చూడాలా.. దేవుడా..’ అనే షాక్‌ను ప్రేక్షకులకు కలిగిస్తుంది.

                                                                             – సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి