Krishna Mukunda Murari Episode September 29th, 2023: జోష్‌లో ముకుంద.. తన ప్రేమని ఎలాగైనా కృష్ణకు చెప్పాలనుకుంటున్న మురారీ..

కృష్ణ తన ప్రేమని ఎందుకు అర్ధం చేసుకోవడం లేదని తల్లిని సలహా అడుగుతాడుఎం మురారీ . కృష్ణకు క్లారిటీగా నా ప్రేమ విషయం చెప్పావు కదా.. తను ఎందుకు మాట్లాడదు అని అని అడిగితె.. ఇది మీరు ఇద్దరు మాత్రం తెలుసుకోవాలని విషయం. ఎవరు మధ్యలో కలగజేసుకోకూడదు అని రేవతి చెబుతుంది. కృష్ణకు నువ్వు ప్రేమిస్తున్నట్లు అర్ధం కావాలంటే.. కృష్ణతో క్లోజ్ గా ఉండడానికి ట్రై చెయ్యి.. మరీ ముఖ్యంగా ముకుంద ఉన్నప్పుడు ఇలా చెయ్యి.. అప్పుడు నువ్వు అడక్కపోయినా ముకుంద తన దారి తాను చూసుకుంటుంది. ఇదే బెస్ట్ వే అని సలహా చెబుతుంది రేవతి. 

Krishna Mukunda Murari Episode September 29th, 2023: జోష్‌లో ముకుంద.. తన ప్రేమని ఎలాగైనా కృష్ణకు చెప్పాలనుకుంటున్న మురారీ..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Sep 29, 2023 | 7:02 AM

ది. కృష్ణ తల తుడిచి ఇలా చేసుకోవాలని చూపిస్తాడు మురారీ.. అప్పుడు మీరు ఎవరినైనా ప్రేమించరా అని అడుగుతుంది కృష్ణ.. తను దగ్గర ఉంటె గొడవ పడాలని పిస్తుంది. దూరంగా ఉంటే దగ్గర కావాలనిపిస్తుంది. ఎప్పటికి తనే కావాలనిపిస్తుంది. ఎవరు తను అంటే నువ్వే కృష్ణ. అంటే ఎవరూ లేరు కృష్ణ.. అంతా ఉత్తుత్తిదే కృష్ణ అని మురారీ చెప్పాడు. మీ ప్రేమ అంతా అబద్దమే అంటారు.. అంటే నిజమే అని అంటే అర్ధం చేసుకుంటారో అపార్ధం చేసుకుంటావో నాకు తెలియాలి కృష్ణ ..నేను అంటే నీకు ఇష్టమని తెలియాలి.. అప్పుడే నా ప్రేమ నీకు చెబుతా కృష్ణ అని అనుకుంటాడు. మొత్తానికి ఇద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని బయటపెట్టుకోకుండా కబుర్లతో గడిపేస్తారు.

జోష్ లో ముకుంద..

అలేఖ్య ముకుంద దగ్గర వచ్చి ఎందుకు ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏమిటి..  కొంపదీసి ఆదర్శ్ రాడన్న విషయం తెలిసిందా అని అలేఖ్య అంటే.. అంత అదృష్టం కూడానా అని ముకుంద అంటుంది. కృష్ణకు మా విషయం తెలిసిందని తాను కృష్ణ తో ఛాలెంజ్ చేసిన విషయం చెప్పిన ముకుంద. ఇంక వార్ స్టార్ట్ అయ్యిందా గా అంటే.. వార్ వన్ సైడ్ నాదే గెలుపు అని అంటుంది ముకుంద. అప్పుడు కృష్ణ.. మురారీతో ఇదంతా చెబితే .. ప్రేమ లేదు ఏమి లేదు అందతా ఒకప్పుడు అని చెబితే.. అప్పుడు కృష్ణది పై చేయి అవుతుంది కదా అని అలేఖ్య డౌట్ వ్యక్తం చేస్తుంది. ఎంత గొడవైనా సరే నాకు మురారీ దక్కేటంత వరకూ పోరాడతాను అనుకుంటుంది.

తల్లిని సలహా అడిగిన మురారీ

కృష్ణ తన ప్రేమని ఎందుకు అర్ధం చేసుకోవడం లేదని తల్లిని సలహా అడుగుతాడుఎం మురారీ . కృష్ణకు క్లారిటీగా నా ప్రేమ విషయం చెప్పావు కదా.. తను ఎందుకు మాట్లాడదు అని అని అడిగితె.. ఇది మీరు ఇద్దరు మాత్రం తెలుసుకోవాలని విషయం. ఎవరు మధ్యలో కలగజేసుకోకూడదు అని రేవతి చెబుతుంది. కృష్ణకు నువ్వు ప్రేమిస్తున్నట్లు అర్ధం కావాలంటే.. కృష్ణతో క్లోజ్ గా ఉండడానికి ట్రై చెయ్యి.. మరీ ముఖ్యంగా ముకుంద ఉన్నప్పుడు ఇలా చెయ్యి.. అప్పుడు నువ్వు అడక్కపోయినా ముకుంద తన దారి తాను చూసుకుంటుంది. ఇదే బెస్ట్ వే అని సలహా చెబుతుంది రేవతి.

ఇవి కూడా చదవండి

మధుకి సేవల చెయ్యడానికి అలేఖ్య ఒక ప్రశ్న అడుగుతుంది.. మొదటి అక్షరం ప్రశ్నించడం .. రెండో అక్షరం తిట్టడం.. మూడో అక్షరం గౌరవించడం ఆ కూరగాయ పేరు చెప్పమని అడుగుతుంది.

హంతకి స్టోరీ చెప్పిన కృష్ణ

మమ్మి చెప్పినట్లు కృష్ణ నాకోసమే ఎదురుచూస్తుండగా.. ముకుంద విషయం చెబితే ఈ సారి కృష్ణ నిజంగానే ఊరు వెళ్ళిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏమిటి.. అనుకుంటుంటే. . ఇంతలో ఫోన్ వస్తుంది కృష్ణకు. హంతకి చెప్పవే.. జైలు నుంచి వచ్చేశావా.. అని అడుగుతుంది. వాసుకి, జానకి లా ఈ హంతకి ఏమిటి.. అంటే నేనే ముచ్చటగా హంతకి అని పెట్టేసుకున్నా అని చెబుతుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టండి.. అని చెబుతుంది. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు దీనిగురించి అని అడుగుతుంది.

మధుకి ముకుంద చేసిన ఛాలెంజ్ చెప్పిన కృష్ణ

మురారీతో ముకుంద తాళి కట్టించుకుంటా అని చేసిన ఛాలెంజ్ ని మధుకి చెబుతుంది. పెద్దతయ్యకు తెలిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియడం లేదు. అందుకే ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ముకుంద పొగరు ఎక్కువ.. ఈగో ఎక్కువ.. ముకుంద షార్ట్ టెంపర్ అని అంటే.. ఏమైనా సన్మానం చేస్తున్నామా అని అంటుంది కృష్ణ.

రేపటి ఎపిసోడ్ లో

కృష్ణ తో ముకుంద నీ కాపురం మూడు నాళ్ల ముచ్చట.. అనవసరంగా ఆశలు పెట్టుకోకు అని అంటే.. వెంటనే కృష్ణ పరాయి వాళ్ల భర్తని ఆశపడుతున్న నిన్ను ఏ పవిత్ర అనాలో అర్ధం కావడం లేదు అని షాకిస్తుంది నీకు ఉన్న మానసిక రోగం పోవాలంటే హ్యాపీగా ఆదర్శ్ కోసం ఎదురుచూడు అని అంటే.. అది ఎన్నటికీ జరగదు అని ముకుంద అంటుంది.. జరిగే తీరుతుంది అని కృష్ణ చెబుతుంది. జరిపించేది నేనే.. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్ వేరబ్బా అంటుంది కృష్ణ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..