KBC 15: కోటి రూపాయలు.. ఒక ప్రశ్న.. రెండు లైఫ్ లైన్స్.. సమాధానం చెప్పని తేజిందర్ .. ఆన్సర్ ఏమిటంటే

ఈ షోని హోస్ట్ చేస్తూ హాట్ సీట్‌లో కూర్చొని ఉన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు అద్భుతంగా సమాధానం ఇచ్చిన తేజిందర్. అంతేకాదు తన భర్త గురించి బిగ్ బితో హృదయాన్ని హత్తుకునే విధంగా కొన్ని విషయాలను పంచుకుంది. తన భర్తకు సినిమాలు చూసే అలవాటు, పాటలు వినాలనే ఆసక్తి లేదని తేజిందర్ తెలిపింది. అయితే  తనకు సినిమాలు చూడటం, పాటలు వినడం అంటే చాలా ఇష్టం.

KBC 15: కోటి రూపాయలు.. ఒక ప్రశ్న.. రెండు లైఫ్ లైన్స్.. సమాధానం చెప్పని తేజిందర్ .. ఆన్సర్ ఏమిటంటే
Kbc 15
Follow us
Surya Kala

|

Updated on: Sep 29, 2023 | 11:35 AM

సోనీ టీవీ క్విజ్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 15’ బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతోంది. మునిపటి ఎపిసోడ్ లో రూ. 3,20,000 గెలుచుకున్న పంజాబ్ కు చెందిన పోటీదారు తేజిందర్ కౌర్ ఆ ఎపిసోడ్ కు కొనసాగింపుగా  తాజా ఎపిసోడ్‌ ప్రసారం అయింది. ఈ ఎపిసోడ్ రూ. 3,20,000లతో తేజిందర్ కౌర్  మొదలు పెట్టింది. అనంతరం నల్లేరు మీద నడకలా సునాయాసంగా కోటి రూపాయల వరకు తేజిందర్ ప్రయాణం అద్భుతంగా సాగింది. అయితే కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ కంటెస్టెంట్ 50 లక్షలు తీసుకొని షో నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకుంది. తేజిందర్ కౌర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమితాబ్ బచ్చన్ కూడా స్వాగతించారు.

ఈ షోని హోస్ట్ చేస్తూ హాట్ సీట్‌లో కూర్చొని ఉన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు అద్భుతంగా సమాధానం ఇచ్చిన తేజిందర్. అంతేకాదు తన భర్త గురించి బిగ్ బితో హృదయాన్ని హత్తుకునే విధంగా కొన్ని విషయాలను పంచుకుంది. తన భర్తకు సినిమాలు చూసే అలవాటు, పాటలు వినాలనే ఆసక్తి లేదని తేజిందర్ తెలిపింది. అయితే  తనకు సినిమాలు చూడటం, పాటలు వినడం అంటే చాలా ఇష్టం. పెళ్లి అయ్యే సమయంలో తన భర్త ఇంట్లో రేడియో కూడా లేదని అయితే తనకు పాటలు వినడం అంటే ఇష్టమని తెలుసుకుని పెళ్లి తర్వాత రేడియో కొన్నాడని పంచుకుందని.

కోటి రూపాయల ప్రశ్నగా అమితాబ్ బచ్చన్..  తేజిందర్‌ను అడిగినప్పుడు.. ఆమె చేతిలో రెండు లైఫ్‌లైన్‌లు ఉన్నాయి. ముందుగా ఆడియన్స్ పోల్ సహాయం తీసుకుంది. అయితే ఆడియన్స్ సమాధానంగా చేసిన  ఎంపికపై నమ్మకం దొరకలేదు. దీనితో ఆమె తన చివరి లైఫ్‌లైన్ ను ‘ఫోన్ ఎ ఫ్రెండ్’ని ఉపయోగించింది. అయినప్పటికీ ఆమె స్నేహితులు కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో తేజిందర్ ఎటువంటి రిస్క్ తీసుకోనని..  50 లక్షలు తీసుకుని ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.

ఇవి కూడా చదవండి

కోటి రూపాయల కోసం తేజిందర్‌ని అడిగిన ప్రశ్న

రాబిన్ నాక్స్-జాన్‌స్టన్ సోలో పడవలో  నాన్‌స్టాప్‌గా ప్రపంచాన్ని చుట్టు ప్రదక్షిణ చేసి చరిత్ర సృష్టించారు. ఈ  సుహైలీ అనే పడవ ఏ నగరంలో నిర్మించబడింది?

A )సూరత్

B) ముంబై

C) కోల్‌కతా

D) కొచ్చి

సరైన సమాధానం – B (ముంబై)

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..