Brahmamudi, September 29th episode: మైఖేల్ ని ఓ ఆట ఆడుకున్న కనకం.. మైఖేల్ ఫోన్ తోనే రాజ్, కావ్యలకు వీడియో కాల్..!!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్నని కాపాడటం కోసం కనకం.. ముసలి పురోహితురాలి గెటప్ లో రెడీ అయి.. మైఖేల్ చెప్పిన పురోహితుడి ప్లేస్ లో అక్కడ నిల్చుంటుంది. కనకాన్ని పురోహితురాలి గెటప్ లో చూసిన మైఖేల్.. కింద నుంచి పైదాగా చూసి ఇదిగో పెద్దమ్మా.. ఇక్కడ పామర్ది సుబ్రమణ్యం గాడి ఇల్లు ఎక్కడ? అని అడుగుతాడు. ఇది విన్న కనకం మైఖేల్ ని ఫుల్లుగా వాయించేస్తుంది. హే ముసలిదానా.. నేను నీకు ఏం అన్యాయం చేశానే.. అలా కొడుతున్నావ్ అని కేకలు పెడుతూ అడుగుతాడు. కొట్టాలా.. చంపాలా.. పింజారీ వెధవ.. మా ఆయన్ని పట్టుకుని వాడూ వీడూ అంటూ కారుకూతలు కూస్తావా..

Brahmamudi, September 29th episode: మైఖేల్ ని ఓ ఆట ఆడుకున్న కనకం.. మైఖేల్ ఫోన్ తోనే రాజ్, కావ్యలకు వీడియో కాల్..!!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Sep 29, 2023 | 12:08 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్నని కాపాడటం కోసం కనకం.. ముసలి పురోహితురాలి గెటప్ లో రెడీ అయి.. మైఖేల్ చెప్పిన పురోహితుడి ప్లేస్ లో అక్కడ నిల్చుంటుంది. కనకాన్ని పురోహితురాలి గెటప్ లో చూసిన మైఖేల్.. కింద నుంచి పైదాగా చూసి ఇదిగో పెద్దమ్మా.. ఇక్కడ పామర్ది సుబ్రమణ్యం గాడి ఇల్లు ఎక్కడ? అని అడుగుతాడు. ఇది విన్న కనకం మైఖేల్ ని ఫుల్లుగా వాయించేస్తుంది. హే ముసలిదానా.. నేను నీకు ఏం అన్యాయం చేశానే.. అలా కొడుతున్నావ్ అని కేకలు పెడుతూ అడుగుతాడు. కొట్టాలా.. చంపాలా.. పింజారీ వెధవ.. మా ఆయన్ని పట్టుకుని వాడూ వీడూ అంటూ కారుకూతలు కూస్తావా.. కూష్మాండం బద్దలైపోతుంది జాగ్రత్త అని కనకం ఫైర్ అవుతుంది. హో నువ్వు ఆడి పెళ్లానివా అని మైఖల్ అనగా.. మళ్లీ చేతి కర్రతో కొట్టబోతుంది కనకం. వెంటనే మైఖేల్ దన్నం పెట్టి.. హో మీరు సుబ్రమణ్యంగారి పెళ్లాం గారా? అని అంటాడు. పెళ్లాం గారూ ఏంట్రా సన్నాసి శ్రీమతి గారా అని అడగాలి.. అమ్మా మీ తెలుగు క్లాసులు ఆపేసి.. కాస్త మీ భర్త గారు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా? అసలే పెళ్లి టైం అవుతుంది అని అంటాడు.

తింగరి మైఖేల్ ని ఓ ఆట ఆడుకున్న కనకం:

ఓహో ఆ పెళ్లి చేసుకోబోతున్న మసిపట్టేసిన తపేలా ముఖం గాడివి నువ్వేనా? అని అంటుంది కనకం. దీనికి మైఖేల్ పీఏ నవ్వుతాడు. అతన్ని కొడతాడు మైఖేల్. తపాలా ముఖం కాకపోతే ఏదో ఒక ముఖం.. అసలు ముఖమే లేదనుకోండి. ఏదైతే ఏముంది కానీ ఆయన్ని పిలవండి అని అంటాడు. పిలవను అని అంటుంది కనకం. ఏమైంది అని అడుగతాడు మైఖేల్. ఉంటేనేగా పిలవడానికి అని సమాధానం చెప్తుంది కనకం. ఏంటీ పోయాడా అని షాక్ అవుతాడు కనకం. ఓరేయ్ దొంగ సచ్చినోడా అని మళ్లీ మైఖేల్ ని ఇరగ్కొడుతుంది. అబ్బా వచ్చినప్పటి నుంచి వాయించేస్తున్నావ్ అని అంటాడు మైఖేల్. ఉంటేగా.. అంటే వేరే పూజకు వెళ్లారు అని చెప్తున్నా అని చెప్తుంది కనకం.

ఇవి కూడా చదవండి

డెన్ దగ్గరకు బయలు దేరిన కనకం, మైఖేల్ టీమ్:

నువ్వు వచ్చి ఏం చేస్తావ్ అని అంటాడు మైఖేల్. నీ పెళ్లి చేస్తా అని వెటకారంగా అంటుంది కనకం. అయినా సరే నీలాంటి పురోహితురాలు వద్దు.. పురోహితుడే కావాలి అని అంటాడు మైఖేల్. నువ్వు నన్ను వద్దన్న విషయం.. గ్రూపులో ఒక్క మెసేజ్ పెడితే.. పిండం పెట్టే పంతులే కాదు.. అవి తినే కాకులే రావు అని అంటుంది కనకం. దీంతో మైఖేల్ ని కన్విస్ చేస్తాడు అతని పీఏ. సరే పదా వెళ్దాం అని పిలుస్తాడు మైఖేల్. ఇలా మైఖేల్ ని ఓ ఆట ఆడుకుంటుంది కనకం.

బాధలో కావ్య.. ఓదార్చుతున్న రాజ్:

ఈ సీన్ కట్ చేస్తే స్వప్న కోసం బాధ పడుతూ ఉంటుంది కావ్య. రాహుల్ ని కొట్టి మా అక్కని తీసుకెళ్లడం ఏంటి? మా అక్క మీద అంత పగ ఎవరికి ఉంది? అని బాధ పడుతుంది. రాజ్, రాహుల్ లేదా నీ మీద పగ తీర్చుకోవడానికి కూడా స్వప్నని కిడ్నాప్ చేయవచ్చు కదా.. అని అంటుంది రుద్రాణి. ఈలోపు సుభాష్ ఏంటి రుద్రాణి నీకు ఇందాకే చెప్పాను కదా.. అసలే కావ్య కంగారు పడుతుంటే.. మళ్లీ భయ పెడతావ్ ఏంటి? అని అంటాడు. అది కాదు అన్నయ్యా.. అన్ని వైపులా ఆలోచించాలి అని చెప్తున్నా.. సరే నేను వెళ్లి రాహుల్ కి ట్యాబ్లెట్స్ ఇచ్చి వస్తాను అని వెళ్తుంది.

స్వప్న చచ్చిపోయిందని నమ్మిన రాహుల్, రుద్రాణిలు:

ఐసీయూ రూమ్ లోకి వెళ్లిన రుద్రాణి.. రాహుల్ ని లేపుతుంది. ఎలా ఉంది అమ్మా మన డ్రామా అని అని అడుగుతాడు రాహుల్. ఇంకా మొదలైతేనే కదా.. స్వప్నకి ఏమైందో తెలిసేంత వరకూ ఎవర్నీ నమ్మరు. ఇప్పుడు పోలీసులని రమ్మని చెప్పారు. ఒక వేళ పోలీసులు వస్తే ప్రాబ్లమ్ ఏమీ అవ్వదు కదా.. అని రాహుల్ ని అడుగుతుంది రుద్రాణి. ఎవ్వరు వచ్చినా ఏమీ కాదు అని చెప్తాడు రాహుల్. ఆ స్వప్న ఎప్పుడో చచ్చిపోయింది మామ్.. అని చెప్తాడు. అవునా అని షాక్ అవుతూ.. ఆనంద పడుతుంది రుద్రాణి. ఇప్పుడు నా పగ చల్లారింది. లేకపోతే నిన్ను కోటీశ్వరుల అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయబోతే.. తన అక్కకి ఇచ్చి పెళ్లి చేస్తుందా.. అటు స్వప్న పీడ విరగడైంది. ఇటు కావ్య కుమిలిపోతూ ఉంది అని అంటుంది రుద్రాణి.

ఇక మైఖేల్, కనకం డెన్ లోకి వెళ్తారు. ఇక్కడ పెళ్లా.. ఇక్కడ తాళి కడతావా అని అడుగుతుంది కనకం. అవును పెళ్లి ఇక్కడే జరుగుతుంది. మాకు ఉన్న ఆప్షన్ ఇదొక్కటే. ఎలాగోలా సర్దుకుని పెళ్లి జరిపించు అని చెప్తాడు మైఖేల్. ఇంతకీ అమ్మాయి ఎక్కడ కనిపించడం లేదు అని కనకం అడుగుతుంది. రేయ్ వెళ్లి.. నా ఏంజెల్ ని తీసుకురండి అని రౌడీలకు చెప్తాడు మైఖేల్. ఏంజెల్ అని అంటున్నావ్.. ఇంతకీ ఇంటర్ కాస్ట్ మ్యారేజా అని కనకం అడగ్గా.. అబ్బా ఊరికే అలా అన్నానులే తల్లీ అని అంటాడు. ఈలోపు రౌడీలు స్వప్నని తీసుకొస్తారు. స్వప్నని చూసిన కనకం.. నేనే అమ్మని అని చెప్తుంది. గమనించిన స్వప్న అమ్మా అని గట్టిగా పిలుస్తుంది. అమ్మా ఏంటి అని మైఖేల్ అనగా.. కవర్ చేస్తుంది.

మైఖేల్ ఫోన్ తోనే కావ్య, రాజ్ లకు వీడియో కాల్ చేసిన కనకం:

ఇక ఆ తర్వాత మైఖేల్ ని మాటల్లో పెట్టి ఫోన్ తీసుకుని.. కావ్యకి లోకేషన్ షేర్ చేస్తుంది కనకం. మెసేజ్ రాగానే కావ్య రాజ్ కి ఫోన్ ఇస్తుంది. ఈలోపు కనకం వీడియో కాల్ చేస్తుంది. ఫోన్ ఎత్తగానే ఇన్ డైరెక్ట్ గా విషయం అంతా చెప్తుంది కనకం. వెంటనే కావ్య, రాజ్ లు.. స్వప్న కోసం బయలు దేరుతారు. ఈలోపు కనకం ఏవేవో మంత్రాలు చదువుతూ మైఖేల్ ని భయ పెడుతుంది. అంతే ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.