- Telugu News Photo Gallery Cinema photos Nayanthara And Vignesh Shivan Celebrates Their Sons 1st Birthday At Malaysia Twin Towers
Nayanthara: నయనతార కవల పిల్లల మొదటి పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. క్యూట్ ఫొటోస్ చూశారా?
నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చి సరిగ్గా నేటికి (సెప్టెంబర్ 27) ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ సందర్భంగా తమ పిల్లల మొదటి పుట్టినరోజు వేడుకలను సింపుల్‌గా జరుపుకున్నారు నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Updated on: Sep 27, 2023 | 10:36 PM

నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చి సరిగ్గా నేటికి (సెప్టెంబర్ 27) ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ సందర్భంగా తమ పిల్లల మొదటి పుట్టినరోజు వేడుకలను సింపుల్‌గా జరుపుకున్నారు నయనతార- విఘ్నేష్ శివన్ దంపతులు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

నయనతార పిల్లలకు ఉయిర్, ఉలగం అని నామకరణం చేసింది. తాజాగా పిల్లల మొదటి పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకుంటారు. ఈ సెలబ్రేషన్స్ ఫోటోలను విఘ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

కాగా ప్రస్తుతం మలేషియాలో విహరిస్తున్నారు నయనతార దంపతులు. ఈ సందర్భంగా ప్రఖ్యాత పెట్రోనాస్ ట్విన్ టవర్ వద్ద తమ పిల్లల బర్త్ డే సెలబ్రెషన్స్ నిర్వహించారు. “మై ట్విన్ టవర్స్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషం.. ఆశీస్సులకు ఏడాది. జీవితంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని.. చుట్టూ ఉన్న వాళ్లకు సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నాం'

మా జీవితాలను మరింత అందంగా మార్చి.. ఎన్నో వెలుగులు నింపారు. మీతో గడిపే ప్రతి క్షణం ఒక పండగలా ఉంటుంది. మీ బర్త్‌డే వేడుకను ఈ ఎత్తైన పవర్ పుల్ టవర్స్ వద్ద చేయాలని కలలు కన్నాం. అనుకున్నట్లుగానే దీనిని నిజం చేశాం' అని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు నయనతార దంపతులు

'జవాన్' సినిమా విజయంతో నయనతార కెరీర్‌లో మరో హిట్ వచ్చి చేరింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ సినిమా ఇటీవలే 1000 కోట్ల క్లబ్‌లో చేరింది.