Actress: ఈ అందమైన అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పటి స్టార్ హీరోయిన్.. గుడి కట్టేంత అభిమానం ఉందండోయ్
ఒత్తైన కురులు.. మత్తైన కళ్లు.. చూపుతిప్పుకోనివ్వని ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా ఈమె గురించి తెలియకపోవచ్చు కానీ 90 వ దశకంలో తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారామె. సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారీ అందాల తార. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు.
ఒత్తైన కురులు.. మత్తైన కళ్లు.. చూపుతిప్పుకోనివ్వని ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా ఈమె గురించి తెలియకపోవచ్చు కానీ 90 వ దశకంలో తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారామె. సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారీ అందాల తార. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. తన అభినయ ప్రతిభకు లెక్కలేనన్నీ అవార్డులు, పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆమె అందానికి, అభినయానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా గుడి కట్టారంటే తనకున్న క్రేజ్, పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్పెషల్ రోల్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. అలాగే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది. యస్.. ఆమె మరెవరో కాదు అలనాటి అందాల తార ఖుష్బూ సుందర్. శుక్రవారం (సెప్టెంబర్ 29) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఖుష్బూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో ఖుష్బూ చిన్ననాటి, అరుదైన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో అందులోదే.
వెంకటేష్ హీరోగా పరిచయమైన కలియుగపాండవులు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఖుష్బూ సుందర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. పేకాట పాపారావు, రాక్షస సంహారం, జయసింహ , తేనెటీగ (1991), భారతంలో అర్జునుడు తదితర హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించారామె. అలాగే చిరంజీవి స్టాలిన్, పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి, రజనీకాంత్ పెద్దన్న , ఇటీవల రిలీజైన రామబాణం సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. ఇక హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ సుందర్‌తో ప్రేమలో పడింది ఖుష్బూ. 1991లో అతనితో కలిసి పెళ్లిపీటలెక్కింది. వీరికి అవంతిక, అనంతిక అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో తరచూ తన కూతుర్ల ఫొటోలను షేర్ చేస్తుంటారు ఖుష్బూ. పెద్ద కూతురు అవంతిక ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటుంది. ఇక సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఖుష్బూ. 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె కాంగ్రెస్‌లో పని చేశారు. అయితే 2020లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం కమలం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.
ఖుష్బూ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.