AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ఇట్స్‌ అఫీషియల్‌.. ప్రభాస్‌ ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. ఆ పండగకు థియేటర్లలో పూనకాలే..

Salaar Release Date:  సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్‌ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామంటూ ఎట్టకేలకు సలార్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఆదిపురుష్‌ తర్వాత ప్రభాస్‌ నటిస్తోన్న సలార్‌ సినిమాపై అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా  సినిమా రిలీజ్ డేట్ తో పాటు  ప్రభాస్ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. 

Salaar Movie: ఇట్స్‌ అఫీషియల్‌.. ప్రభాస్‌ 'సలార్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. ఆ పండగకు థియేటర్లలో పూనకాలే..
Prabhas Salaar Movie
Basha Shek
|

Updated on: Sep 29, 2023 | 11:04 AM

Share

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ సలార్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ పై సస్పెన్స్ కు తెరదించారు మేకర్స్. క్రిస్మస్‌ కానుకగా ఈ ఏడాది డిసెంబర్‌ 22న సలార్‌ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు  అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్‌ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామంటూ ఎట్టకేలకు సలార్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా  సినిమా రిలీజ్ డేట్ తో పాటు  ప్రభాస్ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.  ఇందులో ఒంటినిండా ర‌క్తంతో చేతిలో క‌త్తి ప‌ట్టుకొని ప్ర‌భాస్ క‌నిపిస్తోన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా ఆదిపురుష్‌ తర్వాత ప్రభాస్‌ నటిస్తోన్న సలార్‌ సినిమాపై అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఇందులో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రేయా రెడ్డి, మధు గురుస్వామి, పృథ్వీరాజ్‌, ఝాన్సీ, బ్రహ్మాజీ, జెమిని సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బ్రసూర్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

త్వరలోనే ట్రైలర్..

దాదాపు రెండు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో హోంబ‌లే ఫిల్మ్స్ ప‌తాకంపై విజ‌య్ కిర‌గందూర్ స‌లార్ సినిమాను నిర్మిస్తోన్నాడు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. కాగా రెండు రోజుల నుంచి సలార్ సినిమా  గురించి సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఇప్పటికే మూడు హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ‘ఎక్స్‌’లో ప్రభాస్‌ ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ (#SalaarCeaseFire) హవానే కనిపిస్తోంది.  కాగా ఇప్పటికే రిలీజైన సలార్ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొట్టింది. హీరోని  ఓ రేంజ్ లో ఎలివేట్‌ చేస్తూ ప్రముఖ నటుడు టీనూ ఆనంద్‌ చెప్పిన ఇంగ్లిష్‌’ డైలాగ్స్‌ అభిమానులతో విజిల్స్ కొట్టించాయి. త్వరలోనే ట్రైలర్ తో పాటు పాటలను కూడా రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

పండగకు పూనకాలే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..