Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: పాముతో పోజులిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు మల్టీ ట్యాలెంటెడ్‌ నటిగా బాగా ఫేమస్‌

పై ఫొటోలో ధైర్యంగా పామును పట్టుకుని కెమెరాకు పోజులిస్తోన్న అమ్మాయని గుర్తుపట్టారా? సినిమాలు బాగా చూసే వారు పోలికలు చూసి గుర్తుపట్టవచ్చు. ఇప్పుడామె మల్టీ ట్యాలెంటెడ్‌ నటిగా తెలుగు నాట బాగా ఫేమస్‌. నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా, సింగర్‌గా.. ఇలు బహుముఖ ప్రజ్ఞచాటుతోంది. అందుకే బడా ఫ్యామిలీ నుంచి వచ్చినా మల్టీ ట్యాలెంటెడ్‌ వుమన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. గతంలో లాగా ప్రస్తుతం ఈమె సినిమాలు చేయడం బాగా తగ్గించింది.

Actress: పాముతో పోజులిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు మల్టీ ట్యాలెంటెడ్‌ నటిగా బాగా ఫేమస్‌
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Oct 08, 2023 | 6:00 AM

పై ఫొటోలో ధైర్యంగా పామును పట్టుకుని కెమెరాకు పోజులిస్తోన్న అమ్మాయని గుర్తుపట్టారా? సినిమాలు బాగా చూసే వారు పోలికలు చూసి గుర్తుపట్టవచ్చు. ఇప్పుడామె మల్టీ ట్యాలెంటెడ్‌ నటిగా తెలుగు నాట బాగా ఫేమస్‌. నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా, సింగర్‌గా.. ఇలు బహుముఖ ప్రజ్ఞచాటుతోంది. అందుకే బడా ఫ్యామిలీ నుంచి వచ్చినా మల్టీ ట్యాలెంటెడ్‌ వుమన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. గతంలో లాగా ప్రస్తుతం ఈమె సినిమాలు చేయడం బాగా తగ్గించింది. అయినా వార్తల్లో నిలుస్తోంది. దీనిక ప్రత్యేక కారణం ఆమె చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలే. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తన గొప్ప మనసును చాటుకుంది. ఏకంగా 500 పాఠశాలలను దత్తత తీసుకుని పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోంది. మరి ధైర్యంతో పాటు అందమైన మనసున్న ఈ టాలీవుడ్‌ తారను గుర్తుపట్టారా? లేదా? మమ్మల్నే చెప్పేయమంటారా? ఆమె మరెవరో కాదు.. ప్రముఖ నటి మంచు లక్ష్మి. ఇవాళ (అక్టోబర్‌ 8) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సందర్భంలో ఆమె చిన్ననాటి ,అరుదైన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పైన ఉన్న ఫొటో అందులోదే.

ఇవి కూడా చదవండి

అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. మొదటి సినిమాతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అంతకుముందు కొన్ని ఇంగ్లిష్‌ సీరియల్స్‌, టీవీషోస్‌ లోనూ సందడి చేసింది. దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట, గుంటూర్‌ టాకీస్‌, లక్ష్మీ బాంబ్‌, వైఫ్‌ ఆఫ్‌ రామ్‌, మా వింత గాథ వినుమా, పిట్ట కథలు, మాన్‌స్టర్‌ (మలయాళం) వంటి సినిమాల్లో నటిగా మెప్పించింది మంచులక్ష్మి. పలు హిట్‌ సినిమాలను నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. గతంలో లాగా ఇప్పుడు సినిమాలు చేయకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తోంది మంచు లక్ష్మి. కొన్ని నెలల క్రితం 500 పాఠశాలలను దత్తత తీసుకుని తన మంచి మనసును చాటుకుంది.

మంచు లక్ష్మీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

సైమా అవార్డుల ప్రదానోత్సవంలో మంచు లక్ష్మీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు