Mark Antony OTT: ఓటీటీలోకి విశాల్ సూపర్‌ హిట్ మూవీ.. మార్క్‌ ఆంటోని స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కోలీవుడ్‌ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం మార్క్‌ ఆంటోని. డైరెక్టర్‌ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఎస్‌జే సూర్య మరో లీడ్‌ రోలో పోషించారు. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా మెప్పించారు. అలాగే సునీల్, సెల్వరాఘవన్‌ వైజీ మహేంద్రన్‌, మీరా కృష్ణన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 15న విడుదలైన మార్క్‌ ఆంటోని సూపర్‌ హిట్‌గా నిలిచింది. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌కు కామెడీ టచ్‌ను ఇచ్చి తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది

Mark Antony OTT: ఓటీటీలోకి విశాల్ సూపర్‌ హిట్ మూవీ.. మార్క్‌ ఆంటోని స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Mark Antony Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 08, 2023 | 6:15 AM

కోలీవుడ్‌ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం మార్క్‌ ఆంటోని. డైరెక్టర్‌ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఎస్‌జే సూర్య మరో లీడ్‌ రోలో పోషించారు. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా మెప్పించారు. అలాగే సునీల్, సెల్వరాఘవన్‌ వైజీ మహేంద్రన్‌, మీరా కృష్ణన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 15న విడుదలైన మార్క్‌ ఆంటోని సూపర్‌ హిట్‌గా నిలిచింది. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌కు కామెడీ టచ్‌ను ఇచ్చి తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ మార్క్‌ ఆంటోని సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. విశాల్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. సుమారు 100 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. విశాల్‌ కెరీర్‌లో వంద కోట్ల మైలురాయిని చేరుకున్న మొదటి సినిమా మార్క్‌ ఆంటోనీనే కావడం విశేషం. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన మార్క్‌ ఆంటోని సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ మార్క్‌ ఆంటోని స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చేవారం అంటే అక్టోబర్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది.

మార్క్‌ ఆంటోని సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించారు విశాల్‌. అలాగే వివిధ గెటప్పులతో ఫ్యాన్స్‌ను మెప్పించారు. ఇటీవలే మార్క్ ఆంటోని సినిమాను హిందీలోనూ విడుదల చేశారు. అయితే అక్కడ సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ విశాల్‌ ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ పెట్టడం హిందీనాట హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. మినీ స్టూడియో బ్యానర్‌పై ఎస్‌ వినోద్‌ కుమార్‌ మార్క్‌ ఆంటోని సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాశ్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

డిఫరెంట్ గెటప్పుల్లో అలరించిన విశాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.